సినిమాలు గురుంచి ప్రేత్యేక వ్యాసాలూ వెలువడ్డాక చాలామంది పాఠకులు చదివేవరకు నిద్రపోరు .అంత పిచ్చిఅభిమానులు ఉంటారు .50ఏళ్ళ క్రితం విడుదల అయిన తేనెమనసులు గురుంచి నిన్న తెలుగు మీడియా హోరెత్తిపోయింది.అన్ని వ్యాసాలూ ఆ చిత్రం బాక్ డ్రాప్ గురుంచి చెప్పాల్సినది చెప్పారు.
హీరోగా కృష్ణ ఆ చిత్రంలో పరిచయమయ్యారు .పైగా , సూపర్ స్టార్ కనుక కృష్ణ గురుంచి ఎంత రాసిన కృష్ణ అభిమానులకు ఇంకా చాలదు అనే రాసేదంతా ఆయనపైనే గురిపెట్టి రాసారు .అయితే అందులో నటించిన మరో హీరో రామ్మోహన్ గురుంచి ఏ ఒక్కరు పెద్దగ పట్టించుకోలేదు .వాస్తవానికి రామ్మోహన్ కే ఆచిత్రం లో పెద్ద పేరుతో బాటు ఆంధ్రా దేవానంద్ అనే పేరు వచ్చింది .కాని దురదృష్టం నెత్తికెక్కి కూర్చుంది .వరుసగా చిత్రాలు వచ్చినా ఒక్కసారి పెద్ద ఫులు స్టాప్ పడిపోయి తేరు కోలేకుండా చేసేసింది.కొన్నాళ్ళు నాటకాలు వేస్తూ సాగాడు.అవి మరింతగా వ్యసనాలకు బానిసను చేసాయి .చివరికి మరణానికి చేరువయ్యాడు .ఆ చిత్రం లో హీరోయిన్ సుకన్య కొన్ని చిత్రాలు చేసి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారామే .మరో హీరోయిన్ సంధ్యారాణి అలా ఇలా కొన్ని చిత్రాలు చేసారు .ఆమె చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య .పెళ్లి చేసుకుని సంసార జీవితానికి వెళ్ళిపోయారు .