పార్టీని కాంగ్రెస్ లో( Congress ) విలీనం చేయడమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) ఆశ తీరేటట్టు కనిపించడం లేదు.ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ తో భేటీ అయి, విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు జరిపారు.
అలాగే సిడబ్ల్యుసి సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన సోనియా, రాహుల్ తో ను ఆమె చర్చించినట్లు ప్రచారం జరిగింది.అయితే విలీన ప్రక్రియ ముందుకు వెళ్ళకపోవడంతో, షర్మిల నిరాశ గానే వెనుతిరిగారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తుమ్మల నాగేశ్వరావు ను కాంగ్రెస్ లో చేర్చుకున్నా, షర్మిల విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదట.
ఇప్పటికే పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోనూ( DK Shivakumar ) షర్మిల చర్చలు జరిపారు.
కానీ కాంగ్రెస్ అగ్ర నేతల నుంచి సరైన హామీ లభించకపోవడం తో షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ అంతగా ఆసక్తి చూపించడం లేదట .దీనికి కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలే కారణమట.

షర్మిలను తెలంగాణ రాజకీయాల కమిటీ ఏపీ రాజకీయాలకు( AP Politics ) పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.దీంతో షర్మిల రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది .కాంగ్రెస్ లో తమ పార్టీని విలీనం చేస్తామనే ఉద్దేశంతో సొంతంగా పార్టీ కార్యక్రమాలను ఆమె నిర్వహించలేకపోతున్నారు.అలా అని కాంగ్రెస్ లో విలీన ప్రక్రియను పూర్తిచేసి తాను కోరిన పాలేరు నియోజకవర్గ టికెట్( Paleru ) హామీని పొందలేకపోతున్నారు.దీంతో షర్మిల పరిస్థితి గందరగోళంగా మారింది.

కాంగ్రెస్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ పూర్తి కాకపోతే షర్మిల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా గందరగోళంలో పడినట్టే.షర్మిల రాకను ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యతిరేకిస్తుండడంతో , ఆమె చేరిక విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడుతోంది.ఒకవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో, ఈ రకమైన పరిస్థితి ఏర్పడడం షర్మిలకు తీవ్ర నిరాశ కలిగిస్తోందట.