కాలిఫోర్నియాలోని కోర్టు పింగాణీ వస్తువులు తయారు చేసే కంపెనీకి సుమారు రూ.1.7కోట్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.కంపెనీ బాధ్యతా రాహిత్యం వలన ఓ యువకుడి ప్రాణం పోయిందని అందుకు కంపెనీ నష్టాన్ని భరించాలని పేర్కొంది.
వాదనలు విన్న కోర్టు యువకుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.పూర్తి వివరాలలోకి వెళ్తే.
18 ఏళ్ల యువకుడు కాలిఫోర్నియా లో పింగాణి వస్తువులు తయారు చేసే కంపెనీలో కొంత కాలంగా పని చేస్తూ వచ్చాడు.ఉద్యోగంలో ఉండగా బంకమట్టిని తిప్పే యత్రంలో అనుకోకుండా పడిపోయాడు అయితే చెయ్యికి ఆ యంత్రానికి ఉన్న కత్తి గుచ్చుకోవడం వలన ఆ యంత్రం అతడిని లోపలి లాగేసిందని అతడితో పని చేసే వారు తెలిపారు.
అయితే అతడి అరుపులు విన్న వెంటనే వచ్చి యంత్రాన్ని ఆపేసి అతడిని ఆసుపత్రికి తరలించాలని అనుకున్న తరుణంలో అతడు మరణించాడని తెలిపారు పోలీసులు తెలిపారు.అయితే ఈ స్థానిక కోర్టు సీరియస్ అయ్యింది సంస్థ సరైన జాగ్రత్తలు పాటించక పోవడం వలెనే అతడు ప్రమాదంలో మరణించాడని దృవీకరించిన కోర్టు సదరు సంస్థని ఆ యువకుడికి రూ.1.7కోట్ల చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.