రష్యా బలగాలు ఆక్రమనే లక్ష్యంగా.ఉక్రెయిన్ దేశంలో చేసిన దాడులు.
ప్రపంచాన్ని భయపెట్టేట్లు చేయడం జరిగింది.ఊహించని రీతిలో రష్యా బలగాలు.
ఉక్రెయిన్ దేశం లో బాంబుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో ఉక్రెయిన్ మిలటరీతో పాటు సామాన్యులు కూడా మరణించడం తెలిసిందే.
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది.మరోపక్క ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రజలు.
దేశం విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితి.
ఇటువంటి తరుణంలో ఉక్రెయిన్ దేశాన్ని ఆదుకునే దిశగా.
ప్రపంచ బ్యాంకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ముందుకు వచ్చింది.మేటర్ లోకి వెళ్తే ఉక్రెయిన్ నీ ఆదుకోవటానికి 723 మిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు డిసైడ్ అయ్యి.
ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది.ఈ ప్యాకేజీ వల్ల చాలా వరకు ఉక్రెయిన్ కి కాస్త ఊరట కలిగించడం గ్యారెంటీ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
యుద్ధం కారణంగా రెండు వారాలుగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణించింది.ఈ దశలో ప్రపంచ బ్యాంకు ముందుకు రావటం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.