స్కూల్లో ఫోన్‌ వద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పాఠశాలలో సెల్‌ ఫోన్స్‌ వాడవద్దని టీచర్లకు కండీషన్‌ పెట్టింది.

 Telangana Government Ban Mobile Phones In Telangana Schools-TeluguStop.com

పాఠశాలల్లో ఫోన్‌లను నిషేదిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.క్లాసు రూముల్లో టీచర్లు కాని, విద్యార్థులు కాని ఫోన్‌లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని కూడా తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది.

స్కూలుకు రాగానే ఉపాద్యాయులు తమ ఫోన్‌లను ఆఫీస్‌ రూంలో పెట్టాలని, ఫోన్‌ లేకుండానే క్లాస్‌ రూంకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయమై సుదీర్ఘంగా తాము సర్వే నిర్వహించామని, ఇలా చేసేందుకు ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు ముందుకు వచ్చాయని, అలాగే ఈ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్వాగతిస్తున్నారని విధ్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు.అయితే ఈ ఆదేశాలు సరిగా అమలు అయ్యేది కష్టంగానే కనిపిస్తోంది.

అధికారులు క్లాసు రూంలలో ఫోన్‌ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమగ్రంగా అమలు కావడం కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube