బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అలాగే బొప్పాయి పండుతో పాటు బొప్పాయి రసం తాగినా గాని అన్నే ప్రయోజనాలు కలుగుతాయి.
కొంతమంది బొప్పాయిని ఉడికించుకొని తింటారు.మరికొందరు అయితే పైన చెక్కు తీసుకుని నేరుగా తినేస్తారు.
బొప్పాయి పండ్లు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
దోమకాటు వలన వచ్చే డెంగీ వ్యాధి చికిత్స లో బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.
అలాగే ఈ బొప్పాయి పండులో జింక్, నియాసిన్, విటమిన్ C, కాపర్, సోడియం, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోజు బొప్పాయి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.బొప్పాయి రసంలో విటమిన్ C అధికంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాల అంటు వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.
అలాగే బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు బొప్పాయి జ్యూస్‌ని మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి.ఎందుకంటే బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి రసం తాగడం వలన కంటి సమస్యలు దూరం అవుతాయి.బొప్పాయిలో విటమిన్ A చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఆడవాళ్లు నెలసరి సమయంలో బొప్పాయి రసం తాగితే పొత్తికడుపు నొప్పి,తిమ్మిర్లు తగ్గుతుంది.మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
అలాగే బొప్పాయి రసం తాగడం వలన గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి.మరి బొప్పాయి రసాన్ని ఎలా తయారుచేయాలంటే., బాగా పండిన బొప్పాయిని తీసుకుని, నీటితో బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత తోలును తీసివేయాలి.అనంతరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టాలి.
రుచి కోసం బ్లాక్ సాల్ట్, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకోవచ్చు.తియ్యదనం కావాలంటే కాస్త తేనెను కూడా కలుపుకోవచ్చు.
జ్యూస్ చేసిన తర్వాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్ల చల్లగా తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది.







