ఓ మహిళ పోలీసులను ఆశ్రయించి అత్యంత విచిత్రమైన ఫిర్యాదుతో సహాయం కోరింది.అయితే అలాంటి సహాయం కోసం ఎవరూకూడా తమను ఆశ్రయించవద్దని పోలీసులే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ మహిళ KFC నుండి చికెన్ ఆర్డర్ చేసింది.అయితే చికెన్ బకెట్‌లో తక్కువ ముక్కలు వచ్చాయి.
దీంతో ఆగ్రహించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అమెరికాలో ఉంటున్న ఓ మహిళ ఎమర్జెన్సీ కాల్ చేసి.
తనకు నాలుగు చికెన్ ముక్కలే వచ్చాయి.మరిన్ని చికెన్ ముక్కలు కావాలి అని కోరింది.
ఓహియోలోని కేఎఫ్‌సీ రెస్టారెంట్ నుంచి చికెన్ ఆర్డర్ చేశానని ఆ మహిళ తెలిపింది.తాను ఎనిమిది చికెన్ ముక్కలకు డబ్బులు చెల్లించగా, నాలుగు ముక్కలు మాత్రమే వచ్చాయని తెలిపింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం మహిళ నుంచి అత్యవసర కాల్ అందుకున్న వ్యక్తి ఈ విషయంలో పోలీసులు ఏమీ చేయలేరని చెప్పారు.
ఇది సివిల్ కేసు అని, క్రిమినల్ కేసు కాదని మహిళకు తెలిపాడు.
రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడాల్సిందిగా మహిళకు ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.అయినప్పటికీ ఆమె వినకుండాఈ విషయమై సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడాలని మహిళ కోరింది.
ఈ విషయంలో యూక్లిడ్ పోలీసులు ఆమెకు సహాయం అందించలేదు.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ కమ్యూనిటీ ఓరియెంటెడ్ పోలీసింగ్ సర్వీసెస్ (COPS) తెలిపినవివరాల ప్రకారం 911కి కాల్ చేసి వేధించడం శిక్షార్హమైన నేరం.
దీనికి జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించే అవకాశాలున్నాయి.