టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల చోటు చేసుకున్న పుంగనూరు ఘటనపై స్పందించిన ఆయన ఆ ఘటన చూస్తే బాధేసిందన్నారు.
ఒక మార్గంలో అనుమతి తీసుకుని మరో మార్గంలో వెళ్లారని మండిపడ్డారు.
ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడి వారిని గాయాలపాలు చేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిట్టనివారి అంతు చూస్తామని చంద్రబాబే చెబుతున్నారన్న ఆయన ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రశ్నించారు.పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు కానీ వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని చెప్పారు.
పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అన్న సీఎం జగన్ చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ప్రశ్నించారు.