మీరు జాబ్ కోసం చూస్తున్నారా? అయితే రెజ్యూమ్ ఇలా సిద్ధం చేసుకోండి!

ఇక్కడ ఎవరైనా ముందుగా ఉద్యోగానికి అప్లై చేయాలంటే మొదటగా చేయాల్సిన పని రెజ్యూమె తయారు చేసి, జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలి లేదంటే కంపెనీలకు డైరెక్ట్ గా మెయిల్ చేయాల్సి ఉంటుంది.అప్లై చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ఆ రెజ్యూమె( Resume ) రిక్రూటర్లను విపరీతంగా ఆకర్షించేలా ఉండాలి.

 Are You Looking For A Job? But Prepare A Resume Like This, Resume, Buliding, Tip-TeluguStop.com

లేదంటే మీకు కాల్స్ వచ్చే అవకాశం ఉండదు.ఉద్యోగానికి తగిన విద్యార్హత, ఎక్స్‌పీరియెన్స్( Education, Experience ) వంటివి ఉన్నప్పటికీ వాటిని రెజ్యూమెలో ఆకట్టుకునేలా పొందుపరచకపోతే ఎలాంటి ఫలితం ఉండదనేది గుర్తు పెట్టుకోవాలి.

అందుకే జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్లు సీవీని స్పష్టంగా, ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే విధంగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ దానికి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలను చూద్దాము.

1.ముందుగా మీ రెజ్యూమె వీలైనంత సింపుల్‌గా ఉండాలి.

2.పేజీల కొద్దీ వివరణ రాయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు.సీవీ అనేది ఒకటి, రెండు పేజీల్లోనే క్లుప్తంగా ఉండాలి.అందులోనే వివరాలన్నింటినీ క్లియర్‌గా పొందుపరచాలి.

3.అన్ని రకాల పోస్టులకూ ఒకే రకమైన రెజ్యూమె పనికిరాదని గుర్తెరగాలి.అప్లై చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమె అప్‌డేట్ చేస్తుండాలి.

4.ఏ జాబ్స్‌కు ఏయే స్కిల్స్ అవసరమో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రెజ్యూమెని తయారు చేసుకోవాలి.అప్లై చేస్తున్న ఉద్యోగానికి తగిన నైపుణ్యాల గురించి సీవీలో కచ్చితంగా మెన్షన్ చేయాలి.

Telugu Employees, Latest, Resume, Tips-Latest News - Telugu

5.ఇక్కడ టెక్నికల్ స్కిల్స్‌( Technical skills ) మాత్రమే ఉంచాలని అనుకుంటారు.కానీ పర్సనల్ స్కిల్స్ కూడా ముఖ్యమే.

6.అన్నింటికంటే ముఖ్యంగా ప్రీవియస్ ఎక్స్‌పీరియెన్స్ అలాగే గతంలో మీరు సాధించిన విజయాలను ప్రస్తావించడం అస్సలు మర్చిపోకూడదు.ఎందుకంటే అచీవ్ మెంట్స్ అనేవి రిక్రూటర్లు అట్రాక్ట్ చేసే ప్రధానాంశాలు.

Telugu Employees, Latest, Resume, Tips-Latest News - Telugu

7.అదేవిధంగా రెజ్యూమెలో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి.ఇది చాలా అవసరం.సరైన కమ్యూనికేషన్ కోసం అడ్రస్, ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీలు కరెక్ట్‌గా ఇవ్వాలి.

8.ఇక ఎలాగైనా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో అవాస్తవాలు, అబద్దాలను రెజ్యూమెలో అస్సలు రాయకూడదు.దానివలన ఉపయోగం లేకపోగా లేనిపోని తలనొప్పులు వస్తాయి.

9.డాక్యుమెంట్లు, రిఫరెన్సులు, ఎక్స్‌పీరియెన్స్, స్కిల్స్ విషయంలో నిజాయితీగా ఉండాలి.అప్పుడే చేయబోయే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube