భారత దేశంలో దాదాపుగా 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు.అలా పంటల మీద ఆధారపడిన రైతులకు దాదాపుగా నష్టాలే వస్తాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ వారు వ్యవసాయం( agriculture ) చేయడం మానరు.విత్తనం దగ్గర నుంచి ఎరువులు దాకా, కోత దగ్గర నుంచి పంట మద్దతు ధర దాకా చాలా ఎత్తుపల్లాలు చూస్తూ వుంటారు.
ఇక వర్షాలు సరైన సమయంలో పడవు.అడవి కాచిన వెన్నెల మాదిరి ఇపుడు పట్టణాల్లో వర్షాలు అధికంగా కురుస్తూ పల్లెల్లో అసలు మచ్చుకైనా వర్షాలు పడడం లేదు.
దాంతో పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయి.దీంతో పండించిన పంటకు గిట్టుబాటు రాదు.
ముఖ్యంగా నీరు విడుదల చేయక, కాలవల్లో నీరు పారక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం అందరికీ తెలిసినదే.

ఇపుడు ఇలాంటి రైతుల కోసం ఓ యువకుడు పరిష్కారం కనిపెట్టాడు.అదే వ్యవసాయ నీటిపారుదలని ఆటోమేట్ చేయడం.అవును, ఈ ఆవిష్కరణను “తరంగ్ పటేల్” ( Tarang Patel )అనే యువకుడు ఇన్వెస్ట్ చేసాడు.
ఎం కామ్ చదివిన ఆయన ఇన్ టెక్ హార్నెస్ ప్రైవేట్ లిమిటెడ్( IN TECH HARNESS PRIVATE LIMITED ) కి సీఈవోగా పని చేస్తున్నాడు.రైతులకు ఎదురయ్యే సవాళ్లపై ఆయన చాలా పరిశోధనలు చేశారు.
ఈ క్రమంలోనే సాంకేతిక నిపుణుల సహాయంతో ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్ ని తయారు చేశారు.నీరు లేక పంటలు ఎండుతుంటే రైతు పడుతున్న భాదలో నుంచి ఆ యువకుడు దీనిని కనుగొన్నాడు అని చెబుతున్నారు.

రైతులకు ఎదురయ్యే సవాళ్లపై ఆయన చాలా క్షుణంగా పరిశోధనలు చేసిన తరువాత వారికోసం ఏదన్నా చేయాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా నీటి సరఫరాను ఎదుర్కొంటున్న రైతుల కోసం పేటెంట్ టెక్నాలజీ, నీటి అంతరాయానికి ప్రతిస్పందించే సామర్థ్యంతో వ్యవసాయ నీటిపారుదలని ఆటోమేట్ చేసే యంత్రాన్ని కనుగొన్నాడు.జలప్రవాహ పంప్ కంట్రోల్ ప్రయోజనాలు ఆటోమేటిక్ సెట్టింగ్ ద్వారా నడుస్తుంది.బహుళ పారామితుల ఆధారంగా నీటి సరఫరాను సర్దుబాటు చేస్తుంది.డేటా లాగింగ్ మరియు అనలిటిక్స్ కోసం క్లౌడ్ కనెక్టివిటీ సామర్థ్యం, మాన్యువల్ ఆపరేషన్ అవసరం లేదని చెబుతున్నారు.