సాధారణంగా హెల్మెట్( Helmet ) ధరించకుండా వెహికల్ నడపకండి అనే మాట పెద్దలు, పోలీసుల నోట వింటుంటాం.కానీ ఒకచోట మాత్రం హెల్మెట్ ధరించకుండా పనిచేయకండి అనే మాట వినిపిస్తుంది.
హెల్మెట్ పెట్టుకోకుండా పనిచేస్తే ఏమవుతుంది? అని అడిగితే అక్కడ తల పగులుతుంది అని ఆన్సర్ ఇస్తారు.ఇంతకీ అదేదో స్టోన్ బ్లాస్టింగ్ ప్లేస్ అనుకుంటే పొరపాటే.
అది ఒక గవర్నమెంట్ ఆఫీస్.అందులోకి వెళ్లాలన్నా, పనిచేయాలన్నా హెల్మెట్ తప్పనిసరి లేదంటే శిథిలావస్థలో ఉన్న ఆ ఆఫీసు పైకప్పు నుంచి సిమెంట్ పెచ్చులు, పెల్లలు నెత్తి మీద పెడతాయి.
అదే జరిగితే తల పగిలి రక్త కారే ప్రమాదం ఉంది.అందుకే ఇక్కడ పని చేసే ఆఫీసర్లు హెల్మెట్ ధరిస్తారు.
వివరాల్లోకి వెళ్తే.తెలంగాణ( Telangana ), జగిత్యాల జిల్లా, బీర్‌పూర్ మండలంలో ఎంపీడీవో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది.ప్రభుత్వ ఉద్యోగులకు మరో మార్గం లేక ఆ ప్రమాదకర భవనంలోనే పని చేస్తున్నారు.దాదాపు 100 ఏళ్లనాటి ఈ భవనం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది.భవనంపై నుంచి శిథిలాలు ఒక్కోటిగా తరచూ పడిపోవడంతో తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని, మృత్యువు పలకరించేటటువంటి అనుభవాలు కూడా ఎదురవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.తమను తాము రక్షించుకోవడానికి, ఉద్యోగులు పనిచేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని పై అధికారులు సూచించారు.
అయినప్పటికీ, భవనం ఇప్పటికీ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నందున ఇది సురక్షితమైన పరిష్కారమే కాదు.కార్యాలయాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
ఈ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు.ఉద్యోగుల డేడికేషన్, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని మరికొందరు కామెంట్లు పెట్టారు, పని పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్న భవనంలో ఎవరూ పనిచేయాల్సిన అవసరం లేదని మరికొందరు వ్యాఖ్యానించారు.కార్మికులందరికీ సురక్షితమైన పని చేసే స్థలం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక జిల్లాలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరుకోగా వాటిలో బీర్‌పూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం( MPDO Office ) వింత ప్రమాదకరంగా మారింది.ఈ ప్రమాదకర పరిస్థితుల్లో కొన్నేళ్లుగా ఉద్యోగులు పనిచేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
ప్రభుత్వం కార్యాలయాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించాలని, లేదంటే తామే ఆర్థిక సహాయం చేసి భవనాన్ని బాగు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.