ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వ్యవహారం ఎంత దుమారం లేపిందో అందరికీ తెలిసిందే.ప్రతిపక్షాలు ఎంపీ తీరుపై విరుచుకుపడ్డాయి.
ఈ వీడియోపై టీడీపీ అధికారపార్టీని లక్ష్యంగా చేసుకుంటుండగా.వైసీపీ మాత్రం విచారణలో ఉందని.
నిజంగా అందులో ఉంది గోరంట్ల మాధవ్ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.అయితే ప్రస్తుతానికి కొంత కుదుట పడినట్లు అనిపించినా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తునే ఉంటాయి.
ఇక అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం అనంతరం మాధవ్ కి కొంత ఊరట లభించింది.ఆయన అన్నది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఒరిజినల్ వీడియో కాదు అని… అంటే ఒరిజినల్ వీడియో ఉందనే కదా ప్రశ్న.
ఈ వీడియో సోషల్ మీడియాలో పలు సార్లు ఫార్వర్డ్, రీపోస్టు చేయడం జరిగిందని , ఇలా అనేకసార్లు చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్దారించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు.ఈ వీడియో ఒరిజినల్ కాదు మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
టీడీపీ, మీడియా చానెళ్లపై.ఫైర్

మరి ఒరిజినల్ వీడియో ఉందా… ఉంటే అది ఎప్పుడు బయటకి తీస్తారు.అన్న ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే ఇక్కడ అంతా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే గోరంట్ల అధికార పార్టీ ఎంపీ.
దీని మీద విపక్షాలు రచ్చ రచ్చ చేశాయి.దాంతో ఇపుడు ఎస్పీ ప్రాధమిక దర్యాప్తు ఎంతో కొంత ఊరటను మాధవ్ కి ఇచ్చింది.
అలాగే ఏపీలో బాగా ఇబ్బంది పడుతున్న వైసీపీకి రిలీఫ్ కలిగింది.దీంతో మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
టీడీపీని పలు మీడియా చానెళ్లను కూడా లెక్కలేని తీరున చాలా ఘాటుగా విమర్శించారు.అయితే ఈ వ్యవహారంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది.
గోరంట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ ఇస్తారా.
అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ మాధవ్ ఎపిసోడ్ తో చాలా ఇరుకున పడింది.
అయితే మాధవ్ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆయన మీద చర్యలు తీసుకుంటే అనంతపురం జిల్లాతో పాటు కర్నూల్ లో కూడా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది అని ఆలోచించి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉందని అనిపిస్తోంది.

అయితే మాధవ్ ని వైసీపీ అధినాయకత్వం ఇంతటితో క్షమించేసినట్లేనా.మాధవ్ దుడుకు ప్రవర్తన మీద ఇప్పటికే వైసీపీకి నివేదికలు ఉన్నాయి.ఇక ఆయన భాష కూడా బాగులేదు.
ఆయన వైఖరి ఎపుడూ ముప్పే అన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇంత జరిగాక మాధవ్ కి మరో మారు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే మాధవ్ కి ఎంపీ పదవే ఫస్ట్ అండ్ లాస్ట్ అవుతుందనే చర్చ నడుస్తోంది.అయితే మాధవ్ ఎపిసోడ్ లో ఎంపీకి వెనక ఉన్నది కురుబ సామాజికవర్గమే తప్ప పార్టీ అండ లేదేని కూడా అంటున్నారు.
పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ ప్రయత్నంలోనే ఏకంగా పార్లమెంట్ కి వెళ్లిన మాధవ్ కి న్యూడ్ వీడియో తెచ్చిన తంటాలు మామూలుగా లేవని అంటున్నారు.మరి చూడాలి మాధవ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో…
.