లాల్ సింగ్ చద్దా రివ్యూ: లాల్ సింగ్, బాలరాజు నటనతో అదరగొట్టేశారుగా!

డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లాల్ సింగ్ చద్దా. ఇందులో అమీర్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్ కీలక పాత్రలో నటించారు.

అంతేకాకుండా మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ పై, వయకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ప్రీతం సంగీతం అందించాడు.ఈ సినిమాకు సేతు సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది.ఇక ఇదివరకే ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదలైంది.

Advertisement

ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.

కథ:

1994 లో వచ్చిన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ ఇది.అయితే ఇందులో లాల్ సింగ్ చద్దా తక్కువ ఐక్యూతో పుడతాడు.ఇక అతడి వెన్నెముకలో సమస్య కారణంగా తను కాళ్లు కలుపుల సహాయంతో నడుస్తాడు.

ఇక ఆయనకు రూప అనే అమ్మాయి పరిచయం కావడంతో ఆమె లాల్ తో స్నేహంగా ఉంటూ ప్రతి విషయంలో ఆయనను ప్రోత్సహిస్తుంది.లాల్ సరిగా నడవలేని పరిస్థితి కావటంతో అతని స్కూల్ వాళ్ళు అతనిని చూసి ఎగతాళి చేస్తుంటారు.

దాంతో లాల్ ఆ ఎగితాలిని దృష్టిలో పెట్టుకొని ధైర్యం చేసి పరిగెత్తుతాడు.దీంతో అప్పటి నుంచి లాల్ క్రీడలలో కూడా పాల్గొంటాడు.అంతేకాకుండా భారత రాష్ట్రపతి నుండి గౌరవమైన పథకాన్ని కూడా అందుకుంటాడు.

ఇక భారత సైన్యంలో కూడా చేరగా అక్కడ ఆయనకు బాలరాజుతో పరిచయం ఏర్పడుతుంది.ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ఎలా ఉంటుంది అనేది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వీళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటివి అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

Advertisement

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే అమీర్ ఖాన్ తన ఎమోషనల్ సీన్స్ తో అదరగొట్టాడు.నిజానికి ఆయన పాత్ర చాలా అద్భుతంగా చూపించారు.చాలా గ్యాప్ తర్వాత కరీనాకపూర్ కూడా తన ఎమోషనల్ సన్నివేశాలతో బాగా ఆకట్టుకుంది.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే సింపుల్ గా కనిపించిన కూడా ఆయన నటన మాత్రం ఫిదా చేసింది అని చెప్పవచ్చు.తదితరులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

విషయానికి వస్తే.దర్శకుడు ఈ సినిమా కథను ఎంచుకోవటం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.ఇక ప్రీతం అందించిన మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుంది.

సేతు అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

విశ్లేషణ:

ఇక ఈ సినిమా 1994 విడుదలైన ఫారెస్ట్ గంప్ రీమేక్.ఇక ఈ సినిమాకు దర్శకుడు చాలా మార్పులు చేశాడు.

ఇప్పుడున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన మార్పులతో ఎమోషనల్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, ప్రీతం అందించిన మ్యూజిక్, సినిమా కథ, ఎమోషనల్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కాస్త మార్పులు ఉంటే ఇంకా బాగుండేది.

బాటమ్ లైన్:

రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను మంచి మంచి మార్పులతో తెరకెక్కించాడు దర్శకుడు.దీంతో ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

తాజా వార్తలు