నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా విజయం తర్వాత మరొక మాస్ డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ ద్వారా గోపీచంద్ చెప్పకనే చెప్పాడు.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసాయి.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3’ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.
ఇక ఇప్పుడు అనిల్ బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ రోజు సాయంత్రం 4 గంటల 28 నిముషాలకు మాసివ్ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మరి ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందో అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నారని కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.
హీరోయిన్ గా ప్రియమణి అని వార్తలు వస్తున్నాయి.







