దుబ్బాక ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు ఇంకా టీఆర్ఎస్ ను వీడినట్లు కనపడటం లేదు.టీఆర్ఎస్ పురిటిగడ్డ, కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్ధిపేటను ఆనుకొని ఉన్న నియోజకవర్గంలో తమకు ఎదురే లేదనుకుంటున్న ఆ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ప్రజలు షాక్ ఇచ్చారు.
ఇక్కడ బీజేపీ సంచలన విజయం సాధించగా అదే ఊపును బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేసి టీఆర్ఎస్‌ను దాదాపుగా పీఠానికి దూరం చేసినా.ఆ పార్టీ చివరకు ఎంఐఎంతో కలిసి గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకుంది.
ఈ సారి మరో సిట్టింగ్ సీటు అయిన నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురు దెబ్బ తగిలితే ఇక పార్టీ పని అయిపోయినట్టే అన్న ప్రచారం తెలంగాణ వ్యాప్తంగా మరింత ఎక్కువ అవుతుంది.అందుకే సాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో కేసీఆర్ చాలా ప్లానింగ్‌తో రంగంలోకి దిగారు.
ఇప్పటికే సాగర్‌లో ఓ బహిరంగ సభకు హాజరై అక్కడ పంచాయతీకి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్టు ప్రకటించారు.ఇప్పుడు ఏకంగా మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా వేశారు.
వీరందరికీ మంత్రులను సమన్వయకర్తలుగా నియమించబోతున్నారు.
సాగర్ నియోజకవర్గంలో మండలాలు, మున్సిపాల్టీల వారీగా ఇన్‌చార్జ్‌లు వీరే
తిరుమలగిరికి అదే నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ – అనుములకు రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ – పెద్దవూరకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ – గుర్రంపోడ్ కు నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి – నిడమనూరు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు.
త్రిపురారంకు మహాబుబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్, హాలియా మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప – నియోజకవర్గ కేంద్రమైన నాగార్జునా సాగర్ మునిసిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు.వీరంతా ఆయా మండల కేంద్రాల్లోనే ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.