టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ( Venkatesh ) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా సురేష్ బాబు( Suresh Babu ) నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగారు.అయితే ప్రస్తుతం వెంకటేష్ ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇప్పటికి హీరోగా కొనసాగుతున్నారు.
ఒకానొక సమయంలో ఈయన ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ కథ చిత్రాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు.ఇకపోతే సురేష్ బాబు వారసుడుగా రానా( Rana ) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ హీరో వెంకటేష్ కుమారుడు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాలేదు.
ఇక వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే వెంకటేష్ ఎప్పుడు కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఆయన తన వ్యక్తిగతంగా మాత్రమే తీసుకుంటారు.
ఇక వెంకటేష్ ముగ్గురు కుమార్తెలు ఫోటోలు కూడా మనం సోషల్ మీడియాలో చూడటం చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటాయి.ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో మినహా వెంకటేష్ కుమార్తెలు బయట ఎక్కడ కనిపించరు.
మరి వెంకటేష్ ముగ్గురు కుమార్తెలు ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే.వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత( Ashritha ) ఈమె అందరికీ సుపరిచితమే పెళ్లికి ముందు వరకు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉన్నటువంటి ఈమె పెళ్లి తర్వాత మాత్రం ఏకంగా ఫుడ్ వ్లాగర్ గా మారిపోయారు.ఎన్నో రకాల రెస్టారెంట్లను సందర్శించి అక్కడ ఫుడ్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అంతేకాకుండా ఈమె సోషల్ మీడియా వేదిక తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించినటువంటి పోస్టులకు రిప్లై ఇస్తూ అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
వెంకటేష్ రెండవ కుమార్తె హయ వాహిని( Haya Vahini ) .ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పనిచేస్తున్నారు.అయితే ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు.ఇక త్వరలోనే హయ వాహిని వివాహం చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.విజయవాడకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్ కుటుంబానికి ఈమె కోడలుగా వెళ్లబోతున్నారు.ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఇక వెంకీ మామ మూడో కుమార్తె భావన ( Bavana ) డిగ్రీ పూర్తి చేసినటువంటి ఈమె ఎక్కువగా క్రీడారంగంపై ఆసక్తి కలిగి ఉన్నారని ఈ క్రమంలోనే అదే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ఇక ఈయన కుమారుడు అర్జున్ ( Arjun )మాత్రం ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నారని చదువు పూర్తి అయిన తర్వాత అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.