తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఆసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి విజయంపై కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వచ్చిన బిఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు గట్టి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
దీంతో తెలంగాణలో హస్తంపార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది.తెలంగాణలో అధికార మార్పు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయింది.
ఏపీలోకూడా మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా అధికార మార్పు జరిగే అవకాశం ఉందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం( BRS ) అవినీతికి పాల్పడిందని, అందుకే ప్రజలు కేసిఆర్ పాలనను తిరస్కరించారని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట.అలాగే కాంగ్రెస్, మరియు బిఆర్‌ఎస్ నేతలు కూడా కేసిఆర్ పాలనపై, బిఆర్‌ఎస్ పార్టీ పై చేసిన విమర్శలు గట్టిగానే ప్రభావం చూపాయి.అందుకే తెలంగాణ ప్రజలు అధికార మార్పువైపు అడుగులు వేశారనేది కొందరి అభిప్రాయం.ఇక ఏపీ విషయానికొస్తే ఏపీలో కూడా జగన్ సర్కార్ పై కొంత సానుకూలత కొంత ప్రతికూలత కనిపిస్తూనే ఉంది.
గత నాలుగున్నర సంవత్సరాల జగన్( YS Jagan Mohan Reddy ) పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ధరల పెరుగుదల, బస్సు చార్జీల పెంపు, ఇసుక విధానం.ఇలా చాలా అంశాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని టీడీపీ, జనసేన పార్టీల నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే అవకాశంఉంది.దీంతో ఏపీ ప్రజలు కూడా అధికార మార్పు వైపు అడుగులు వేసిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.కాగా ఏపీలో ఈసారి 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఆ స్థాయి విజయం సాధ్యమేనా ? అసలు వైసీపీ రెండోసారి అధికారం సాధిస్తుందా ? తెలంగాణలో మారిన పరిణామాల దృష్ట్యా ఏపీ రాజకీయాలు ఎలా టర్న్ కాబోతున్నాయి ? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి వీటికి సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాలి.