రాధేశ్యామ్ సినిమాలో ఆ ఒక్క సన్నివేశం కోసం 5 నెలలు కష్టపడ్డాం... డైరెక్టర్ రాధాకృష్ణ!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో యు.వి.

 We Worked Hard For 5 Months For That One Scene In Radheshyam Movie By Director R-TeluguStop.com

క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా మార్చి 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రాధాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ఒక ఎత్తయితే, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒక ఎత్తు అంటూ తెలియజేశారు.

ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రయిలర్స్, టీజర్, పోస్టర్లలో చూస్తున్న షిప్ ఎపిసోడ్ క్లైమాక్స్ లోనే వస్తుందని దర్శకుడు తెలియజేశారు.ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం చిత్రబృందం చాలా కష్టపడ్డామని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వివరించారు.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు జరిగాయి అయితే కేవలం క్లైమాక్స్ సీన్ కోసం మాత్రమే ఐదు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కష్టపడ్డామని డైరెక్టర్ రాధాకృష్ణ తెలియజేశారు.

Telugu Climax Scene, Prabhas, Radhakrishna, Radheshyam, Tollywood-Movie

ఈ సినిమా మొత్తంలో తనకు ఎంతో ఇష్టమైన సన్నివేశం కూడా ఈ క్లైమాక్స్ సన్నివేశం అని డైరెక్టర్ చెప్పడంతో అభిమానులకి కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి.మరి లాస్ట్ క్లైమాక్స్ సన్నివేశం కోసమే ఇంత కష్టపడ్డారని తెలియడంతో ఆ సన్నివేశం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆతృత పడుతున్నారు.మరి ఈ సన్నివేశం ఎలా ఉంటుంది ఈ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకులను ఎలా సందడి చేయబోతున్నారనే విషయం తెలియాలంటే మార్చి 11వ తేదీ వరకు వేచి చూడాలి.

ఇందులో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube