తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారు.
ఇక అన్న బాటలోనే ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బిజీగా ఉండగా.
ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం అనే సినిమాను పూర్తి చేసుకొని ప్రమోషన్ పనిలో పడ్డారు.ఈ క్రమంలోనే ఈ ఇద్దరు బ్రదర్స్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రిలేషన్షిప్ ఉన్నాయి? అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సమాధానంగా ఆనంద్ చెబుతూ విజయ్ కి సుమారు 30,40,50 మందితో రిలేషన్షిప్ ఉన్నాయని ఆనంద్ దేవరకొండ చెప్పారు.
అన్నయ్య ఇండస్ట్రీలోకి రాక ముందే అతనికి ఎక్కువ రిలేషన్ షిప్స్ ఉండేవని తెలియజేశారు.ఇక ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు కెరియర్ పై ఎన్నో ఆలోచనలు ఉండటంచేత చాలా రిలేషన్స్ బ్రేక్ అయ్యాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే తనకు ఎక్కువ రిలేషన్ షిప్స్ లేవని ఒకవేళ ఉన్నా ఒక అమ్మాయితో ఉంటుందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలిపారు.అదేవిధంగా వీరు చిన్నప్పుడు ఏ విధంగా పోట్లాడుకునే వారు, రిమోట్ కోసం,బొమ్మల కోసం బాగాగొడవ పడేవారని ఈ సందర్భంగా వారి చిన్నప్పటి జ్ఞాపకాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు.