‘బిచ్చగాడు’ మ్యాజిక్‌ రీ క్రియేట్‌ చేయడం అసాధ్యం

తమిళం మరియు తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన విజయ్‌ ఆంటోనీ ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది. అమ్మ సెంటిమెంట్‌తో అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

 Bichagdu Movie, Vijay Antony, Bichagadu Movie Sequel,-TeluguStop.com

విజయ్‌ ఆంటోనీ ఈ సినిమాను రూపొందించేందుకు గత ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

తాజాగా కరోనా సంక్షోభం నడుస్తున్నా కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు.తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు.

తెలుగు మరియు తమిళ ఆడియన్స్‌ చాలా ఆసక్తిగా ఈ రీమేక్‌ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ముందే ఈ సినిమాపై కొందరు నెటిజన్స్‌ పెదవి విరుస్తున్నారు.ఈ సినిమాకు అంత సీన్‌ ఉంటుందా అంటున్నారు.అద్బుతాలు పదే పదే ఆవిష్కారం అవ్వాలంటే మామూలు విషయం కాదు.

తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన బిచ్చగాడు మళ్లీ సీక్వెల్‌గా వస్తే జనాలు చూసేందుకు ఆసక్తిగా ఉన్నారా అంటే లేరనే సమాధానం వినిపిస్తుంది.ఎందుకంటే గతంలో క్రియేట్‌ అయిన మ్యాజిక్‌ మళ్లీ క్రియేట్‌ అవ్వడం అంటే సాధ్యం అయ్యే పని కాదు.

‘బిచ్చగాడు’ మ్యాజిక్‌ రీ క్ర�

కొందరు విజయ్‌ ఆంటోనీ ఫ్యాన్స్‌ మాత్రం ఖచ్చితంగా బిచ్చగాడు మ్యాజిక్‌ రీ క్రియేట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కబోతుంది అనేది చూడాలి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని విజయ్‌ అంటున్నాడు.తమిళంలో ఆడినా తెలుగులో మాత్రం ఈ సినిమా ఆడనుందనే నమ్మకంను చాలా మంది కలిగి లేరు.ఒక వేళ తెలుగులో కూడా బిచ్చగాడు 2 సక్సెస్‌ అయితే విజయ్‌ ఆంటోనీ అద్బుతంను రీ క్రియేట్‌ చేసిన ఘనత దక్కించుకున్నట్లే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube