హిందువులు ఎంతో సందడిగా, అత్యంత సంతోషకరంగా చేసుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి.దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలు చాలా వైభవంగా జరుగుతుంటాయి.
వినాయక చవితి ఈ ఏడాది ఆగస్టు 31న నిర్వహించనున్నారు.భారతదేశంలో చాలా మంది హిందువులు తమ ఇళ్లలోకి గణేశుడి విగ్రహాన్ని పెట్టుకుని, పూజలు చేస్తారు.
నిర్ణీత రోజుల తర్వాత వాటిని నిమజ్జనం చేస్తారు.ఇక సామూహికంగా పెట్టే వినాయక విగ్రహాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది.
ఆ వినాయక విగ్రహాలు ఆకర్షణీయమైన రూపాలలో ఆకట్టుకుంటాయి.కొందరు తమ క్రియేటివిటీని ఉపయోగించి, రకరకాలుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తారు.
ఈ క్రమంలో యూపీలోని చందౌసీలో పెట్టనున్న వినాయక విగ్రహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వినాయక విగ్రహం ఎంత వైవిధ్యంగా ఉంటుందో ప్రజలను అంతగా ఆకట్టుకుంటుంది.కొంత మంది దానిని కరెన్సీ నోట్లతో అలంకరిస్తారు.ఇంకొందరు నాణేలతో అలంకరిస్తారు.మరికొందరు కూరగాయలతో గణనాథుడిని తయారు చేస్తారు.అయితే యూపీలోని చందౌసీ ప్రాంతంలో బంగారు గణపతిని పెట్టడం ఆసక్తికరంగా మారింది.18 అడుగుల పొడవు, బంగారు పడకలతో కూడిన విగ్రహాన్ని చెక్కారు.ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న అజయ్ ఆర్య మాట్లాడుతూ, విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుందన్నారు.దీనికి తిరుపతి బాలాజీ తరహాలో బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నట్లు వివరించారు.
దీనికి సంబంధించి విగ్రహం కొన్ని అద్భుతమైన వివరణాత్మక పనితో వీడియోలో చూపబడింది.
మరోవైపు ముంబైలో సరస్వత్ బ్రాహ్మిణ్ సేవా మండల్ కూడా ఇదే తరహాలో అత్యంత ఖరీదైన గణపతిని ఏర్పాటు చేయిస్తోంది.గణపతి విగ్రహానికి ఏకంగా రూ.316.40 కోట్లకు ఇన్స్యూరెన్స్ కూడా చేయించారు.గణేశోత్సవ్ అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి, అనంత చతుర్దశి నాడు 10 రోజుల పాటు సాగే పండుగ.
ఈ సంవత్సరం, గణేష్ చతుర్థి ఆగస్టు 31, 2022న వస్తుంది, అయితే గణేష్ విసర్జన్ సెప్టెంబర్ 9న ఉంది.సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నందున, చాలా మంది గణేశుడిని తమ ఇళ్లలోకి స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని చందౌసిలో గణేష్ చతుర్థి కోసం 18 అడుగుల ఎత్తు, బంగారు పడకలతో కూడిన విగ్రహాన్ని చెక్కుతున్నారు.ANI షేర్ చేసిన వీడియో, విగ్రహం సిద్ధమవుతున్నట్లు చూపిస్తుంది
.