పవన్ సినిమా నిర్మాతల పరిస్థితి దారుణం.. ఆ రెండు సినిమాలు ఎన్నికల తర్వాతే అంటూ?

Ustaad Bhagat Singh And Hari Hara Veera Mallu To Resume Shoot After Ap Assembly Polls, Tollywood, Pawan Kalyan, Ustaad Bhagat Singh, Hari Hara Veera Mallu, Ap Assembly Polls ,pawan Kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.మొన్నటివరకు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

 Ustaad Bhagat Singh And Hari Hara Veera Mallu To Resume Shoot After Ap Assembly-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి.అయితే ఇందులో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

నిజానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్.

Telugu Ap Assembly, Gabbar Singh, Harihara, Pawan Kalyan, Tollywood, Ustaadbhaga

గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh ) తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి భారీగా అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్కువ రోజులు షూట్ కూడా జరగలేదు.మరోవైపు హరిహర వీరమల్లు సినిమాను ఎప్పుడో ప్రారంభించినప్పటికీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది.వచ్చే ఏడాది ఏపీలో ఎలక్షన్స్ జరగనుండగా తన సినిమాల సంగతి పక్కన పెట్టి రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్.

తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉండడంతో పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.

Telugu Ap Assembly, Gabbar Singh, Harihara, Pawan Kalyan, Tollywood, Ustaadbhaga

ఓజీ సినిమా( OG Movie )కి సుమారు 20 రోజులు పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇస్తారు కానీ ఉస్తాద్ అసలు షూటింగ్ చేయాలంటే చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.అలాగే హరిహరవీరమల్లు కోసం కూడా మేకోవర్ అవ్వాలి కాబట్టి ఆ సినిమాకి కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపంచడం లేదు.ఒకవేళ ఏపీలో ఎలక్షన్స్ అయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి ఈ సినిమాల షూటింగ్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి ఈ హరిహర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలు ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే మొదలు పెట్టనున్నారు అన్న విషయం పూర్తిగా అర్థమవుతోంది.పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో గెలిస్తే మాత్రం ఆ రెండు సినిమాలను దర్శక నిర్మాతలు మర్చిపోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube