అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,( US President Joe Biden ) ఆయన సతీమణి ప్రథమ మహిళ జిల్ బైడెన్లు( Jill Biden ) సోమవారం 2023 ఏడాదికి గాను తమ ట్యాక్స్ రిటర్న్‌ను( Tax Return ) బహిరంగంగా విడుదల చేశారు.పారదర్శకత సంప్రదాయాన్ని బైడెన్ దంపతులు కొనసాగించారు.
వైట్‌హౌస్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడానికి ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు.ఇతర రాజకీయ నాయకులు, అభ్యర్ధులు కూడా తరచుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ట్యాక్స్ రిటర్న్‌లను బట్టి బైడెన్ దంపతులు 2023లో 6,19,976 డాలర్లు సంపాదించారు.వీటిలో ఎక్కువ భాగం అధ్యక్షుడి జీత భత్యాలే వున్నాయి.బైడెన్ వేతనం 4,00,000 డాలర్లతో పాటు వర్జీనియాలోని( Virginia ) ఒక కళాశాలలో బోధించినందుకు జిల్ బైడెన్‌కు 85,985 డాలర్లు వచ్చాయి.అయితే 2022తో పోలిస్తే ఈ జంట సంపాదించిన మొత్తం పెరిగింది.ఆ ఏడాది 5,79,514 డాలర్లు.2021లో 6,10,702 డాలర్లు బైడెన్ దంపతులకు ఆదాయంగా వచ్చాయి.వీరిద్దరూ ఫెడరల్ పన్నుల కింద 1,46,629 డాలర్లు చెల్లిస్తున్నట్లుగా నివేదించారు.
అంతేకాకుండా తన స్వస్థలం డెలావేర్‌లోనూ( Delaware ) ఆదాయపు పన్నుల కింద 30,908 డాలర్లు చెల్లించినట్లు జో బైడెన్ పేర్కొన్నారు.అలాగే జిల్ బైడెన్ వర్జీనియా ఆదాయపు పన్నుల కింద 3,549 డాలర్లు చెల్లించినట్లుగా పేర్కొన్నారు.తాను మొత్తంగా 26 సార్లు తన ట్యాక్స్ రిటర్న్స్‌ను బహిర్గతం చేసినట్లు బైడెన్ వెల్లడించారు.
దీనితో పాటు 20,477 డాలర్లను తాము విరాళాల రూపంలో ఇచ్చినట్లు వారు చెప్పారు.
ఈ సంప్రదాయాన్ని అనుసరించకూడదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భావించారు.అయితే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.అధ్యక్షుడు కావడానికి ముందు బిలియనీర్, వ్యాపారవేత్తగా వున్న ట్రంప్ తన ట్యాక్స్ రిటర్న్స్, ఇతర వార్షిక రికార్డులతో పాటు అన్ని మూలాలు, ఆదాయ మొత్తాలను దేశ ప్రజలకు వివరించడానికి నిరాకరించారు.
అయితే యూఎస్ కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు జరిపిన చట్టపరమైన పోరాటం తర్వాత చివరికి ట్రంప్ తన ట్యాక్స్ రిటర్న్స్‌ను బహిర్గత పరిచారు.ఈ క్రమంలో వ్యాపారంలో నష్టాల కారణంగా ట్రంప్ కొన్ని సార్లు ఆదాయపు పన్ను చెల్లించని ఉదంతాలు బయటపడ్డాయి.2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ట్రంప్ తన ట్యాక్స్ రిటర్న్స్‌ను ప్రైవేట్‌గా వుంచడం కొనసాగిస్తున్నారు.