దక్షిణాఫ్రికాలో భారత సంతతి సంగీతకారుడు బారీ బల్దేవ్ కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా గాయకుడు , సంగీతకారుడు సురబ్‌జిత్ జైబెల్లీ బల్దేవ్( Surabjit Jaybelly Baldeo ) కన్నుమూశారు.ఆయన వయసు 66 సంవత్సరాలు.

 Indian Origin South African Musician Barry Baldeo Dies Details, Indian Origin ,s-TeluguStop.com

బారీ బల్దేవ్‌గా( Barry Baldeo ) ప్రసిద్ధి చెందిన ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.బల్దేవ్ చివరి ప్రదర్శన శనివారం మిద్రాండ్‌లో జరిగిన తమిళ నూతన సంవత్సర కచేరీ.

దక్షిణాఫ్రికాలోని( South Africa ) ప్రతి భారతీయ సంగీత ప్రదర్శనలో బల్దేవ్ కీలకంగా వుండేవారని ఆయన సన్నిహితులు, మిత్రులు గుర్తుచేసుకున్నారు.పరికరాలు అమర్చడంలో , బ్యాండ్, గాయకులతో రిహార్సల్ చేయడంలో , ప్రదర్శనలో, వాయించడంలో బారీ కీలకపాత్ర పోషించేవారని షణ్ముగన్ అనే కళాకారుడు గుర్తుచేసుకున్నారు.

Telugu Barry Baldeo, Wave Radio, Indian Origin, Indianorigin, Africa, Tamil-Telu

బారీ ఒక పరిపూర్ణవాది అని.అతను వాయించిన గిటార్ల శ్రేణిలో ఆయన నైపుణ్యం సాటిలేనిదని ప్రశంసించారు.బల్దేవ్ సున్నిత ప్రవర్తన, యువ సంగీతకారులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సాయం చేయాలనే అతని సంకల్పం ఎప్పుడూ గుర్తుంటుందనిన షణ్ముగన్ అన్నారు.సురబ్‌జిత్ జైబెల్లి బల్దేవ్.గతంలో ఈస్ట్ వేవ్ రేడియో స్టేషన్‌లో( East Wave Radio Station ) స్టేషన్ మేనేజర్‌గా పనిచేశారు.ఈ సందర్భంగా ఈస్ట్ వేవ్ రేడియో సిబ్బంది బల్దేవ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన నాయకత్వం, నిబద్ధత స్టేషన్ ఎదుగుదలను గణనీయంగా ముందుకు తీసుకెళ్లాయని వారు గుర్తుచేసుకున్నారు.ప్రత్యేకించి కమ్యూనిటీ రేడియోలో రెగ్యులేటరీ లాండ్ స్కేప్‌లు అభివృద్ధి చెందుతున్నప్పుడు బల్దేవ్ వ్యక్తిత్వం, టీమ్ స్పిరిట్‌ను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించాయని స్టేషన్ హెడ్ వికాస్ మహారాఘ్ చెప్పారు.

Telugu Barry Baldeo, Wave Radio, Indian Origin, Indianorigin, Africa, Tamil-Telu

బారీ బల్దేవ్ హఠాన్మరణం పట్ల దక్షిణాఫ్రియా తమిళ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఆయన లెక్కలేనన్ని కమ్యూనిటీ ఈవెంట్‌లలో పాల్గొన్నారని.విభిన్న సంస్కృతులను కలిపే వారధిగా వ్యవహరించారని వారు గుర్తుచేసుకున్నారు.బల్దేవ్‌కు నివాళులర్పిస్తున్నామని.సంగీత సౌభ్రాతృత్వానికి చేసిన కృషికి విస్తృతంగా గుర్తింపు పొందారని తెలిపారు.తాము ఒక దిగ్గజాన్ని కోల్పోయామని తమిళ ఫెడరేషన్( Tamil Federation ) ఒక ప్రకటనలో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube