భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, అతని భార్య అమీ వేక్‌ల్యాండ్( Amy Wakeland )లు సోమవారం సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాయాలన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాయబారి పర్యటన సందర్భంగా , శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఎరిక్ గార్సెట్టితో పలు విషయాలను చర్చించారు.అమెరికా నుంచి అమృత్‌సర్‌లోని శ్రీగురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి( Sri Guru Ramdas Ji Airport ) నేరుగా విమానాలను ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని హర్జిందర్ అభ్యర్ధించారు.
ఈ విషయంపై గార్సెట్టి సానుకూలంగా స్పందించినట్లు ధామి తెలిపారు.
స్వర్ణ దేవాలయానికి వచ్చిన సందర్భంగా సమాచార కేంద్రంలో సచ్‌ఖండ్ శ్రీ హర్మిందర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్), పుస్తకాలు, శాలువాతో గార్సెట్టిని , అతని కుటుంబ సభ్యులను ధామీ సత్కరించారు.అనంతరం గార్సెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీగురురామ్ దాస్ లంగర్ హాలును సందర్శించారు.అనంతరం పార్కర్మ (ప్రదక్షిణ), సేవ (స్వచ్ఛంద సేవ) నిర్వహించారు.
తర్వాత సచ్‌ఖండ్ శ్రీహర్మిందర్ సాహిబ్( Sri Harmandir Sahib )కు నివాళులు అర్పించడానికి వెళ్లారు.అక్కడ ఆయనకు హజూరి సింగ్ పూల మాల, పటాషా ప్రసాదం అందజేశారు.
తన గోల్డెన్ టెంపుల్ పర్యటన వివరాలను గార్సెట్టి( Eric Garcetti ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు.‘‘ప్రపంచంలో నిజంగా కొన్ని పవిత్రమైన ప్రదేశాలు వున్నాయి.గోల్డెన్ టెంపుల్ ఆ జాబితాలో అగ్రస్థానంలో వుంది.అమెరికా – సిక్కుల మధ్య లోతైన స్నేహం ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతిని తెస్తుంది.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.తన సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో పెద్ద సంఖ్యలో సిక్కులు( Sikhs ) వున్నారని.
వారితో తనకు మంచి సంబంధాలు వున్నాయని ధామి పేర్కొన్నారు.అమెరికా నుంచి అమృత్‌సర్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడం వల్ల అగ్రరాజ్యంలో స్థిరపడిన పంజాబీలకు సౌకర్యవంతమైన కనెక్టివిటీ లభిస్తుందని గార్సెట్టి అన్నారు.