తండ్రికి గర్వకారణం.. దేశానికి స్ఫూర్తి: అమెరికాలో సీటు సంపాదించిన రైతు కొడుకు

కృషి, పట్టుదల, శ్రమించే గుణం వున్న వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.దీనిని అక్షరాల నిజం చేస్తూ… ఓ బాలుడు ప్రతిభకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించాడు.

 Farmers Son In Up Remote Village Scored 98.2 Percent In Cbse Class 12 Exam, Cbse-TeluguStop.com

చదువుని ప్రేమించిన ఆ విద్యార్ధి తండ్రికి గర్వకారణంగా నిలిచాడు.ఇప్పుడు ఆ రైతు కొడుకు సాధించిన విజయాన్ని చూసి దేశం మొత్తం షాక్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కొడుకు అనురాగ్ తివారీ సీబీఎస్‌ఈ పరీక్షల్లో సంచలనం సృష్టించాడు.12వ తరగతి చదువుతున్న అతను 98.2 శాతం స్కోరు సాధించి, పూర్తి స్కాలర్‌షిప్‌పై అమెరికాలోని ప్రతిష్టాత్మక ఐవీవై లీగ్ యూనివర్సిటీలో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకున్నాడు.ఈ బాలుడి ఘనతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, బుధవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి నెలలో 2019- 20 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షల్లో 91.6 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.2019 ఫలితాల కంటే 0.36 శాతం మంది అధికంగా విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు వెల్లడించింది.నేడు విడుదల చేసిన ఫలితాలలో తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు జోన్స్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయని బోర్డు తెలిపింది.ఈ ఏడాది మొత్తం 18 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇందులో ఒకటి లేదా రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని బోర్డ్ తెలియజేసింది.

ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను త్వరలో తెలపనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube