సాధారణంగా చాలా మంది ప్రజలు యూఎస్, యూకే దేశాల్లో స్థిరపడాలని ఆశిస్తారు.కానీ యూకేకి( UK ) చెందిన ఓ తల్లి మాత్రం ఆ దేశాన్ని వదిలింది.
ఆమె ఒక సింగిల్ పేరెంట్,( Single Parent ) ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.హెల్త్, ఫైనాన్షియల్ కండిషన్ పరంగా యూకే కంటే దేశం కాని దేశంలో నివసించడమే బెటర్ అని ఆమె భావించింది.
అందుకే తన ఇద్దరు పిల్లలతో థాయ్‌లాండ్‌కు( Thailand ) తరలి పోయింది.తద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఆమె తన స్టోరీని టిక్‌టాక్‌లో పంచుకుంది, అక్కడ ఆమె క్రౌన్ కర్ల్స్( Crown Curls ) అనే పేరుతో ఓ అకౌంట్ రన్ చేస్తోంది.ఆమె ఇటీవల షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది, అది చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.
తాను యూకేలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, బిల్లులు చెల్లించలేకపోతున్నానని క్రౌన్ కర్ల్స్ తెలిపింది.ఆమె సింగిల్ పేరెంట్, తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని కోరుకుంది.వెచ్చని ప్రదేశంలో నివసించడం తమ ఆరోగ్యానికి మంచిదని ఆమె భావించింది.థాయ్‌లాండ్‌కు వెళ్ళేటప్పుడు ఆమె ఎలాంటి స్పష్టమైన ప్లాన్ చేసుకోలేదు.
ఎక్కువ ఆలోచించకుండా టిక్కెట్లు కొని వెళ్లిపోయింది.అయితే ఇప్పుడు టైం డిఫరెన్స్, కొత్త కల్చర్ కు తగ్గట్టుగా సర్దుకుపోతున్నానని చెప్పింది.
ఇకపై డబ్బు కోసం చింతించనవసరం లేదని ఆనందం వ్యక్తం చేసింది.ఆమె తన పిల్లలకు ఒక సంవత్సరం పాటు హోమ్‌స్కూల్( Homeschooling ) చేసి కొత్త విషయాలు నేర్పించాలని ప్లాన్ చేసింది.రోజూ ఉత్సాహంగా, పాజిటివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతున్నానని తెలిపింది.భవిష్యత్తులో అద్భుతాలు ఆశించకపోయినా ప్రస్తుతానికి విముక్తి లభించిందని స్వేచ్ఛగా ఉంటానని చెబుతోంది.
ఆమె టిక్‌టాక్ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, కామెంట్లు వచ్చాయి.చాలా మంది మహిళలు ఆమె ధైర్యాన్ని కొనియాడారు.మరికొందరు ఇంత పెద్ద మార్పు చేసేంత ధైర్యం తమకు లేదని అన్నారు.క్రౌన్ కర్ల్స్ కొన్ని కామెంట్స్‌కు రిప్లై ఇస్తూ కలలను అనుసరించమని ప్రోత్సహించింది.