Strange Bowling : ఇదెక్కడి విచిత్రమైన బౌలింగ్.. మెలికలు తిరుగుతూ వికెట్లు పడగొట్టాడుగా..

క్రికెట్ గేమ్‌కు( Cricket ) సంబంధించి అడపాదడపా హిలేరియస్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

 Fans Left Perplexed As Off Spinner Bowls Magical Delivery To Dismiss Batter Vid-TeluguStop.com

ఇందులో ఒక బౌలర్ వేసిన బంతి ఊహించని విధంగా మెలికలు తిరిగింది.దానిని షాట్‌ ఆడేందుకు బ్యాటర్ చాలా ప్రయత్నించాడు కానీ అది ఊహించని విధంగా ట్విస్ట్ అయి వికెట్లను తాకింది.

అంతే, అతడు ఔట్ అయ్యాడు.ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ప్రస్తుతం కువైట్‌లోని( Kuwait ) వివిధ జట్ల మధ్య KCC T20 ఛాలెంజర్స్ కప్ 2024 జరుగుతోంది.ఈ టోర్నమెంట్‌లోనే ఫన్నీ బౌలింగ్ ఘటన చోటు చేసుకుంది.ఈ వీడియోలో కువైట్ నేషనల్స్ జట్టుకు చెందిన ముహమ్మద్ వకార్ అంజుమ్( Muhammad Waqar Anjum ) SBS CC టీమ్ ప్లేయర్ బియాంట్ సింగ్‌కు బౌలింగ్ చేస్తున్నాడు.వకార్ చాలా ఎత్తైన బంతిని విసిరాడు, అది సింగ్ బ్యాట్‌కు నేరుగా వస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ మధ్యలోకి రాగానే అది మలుపు తిరిగింది.దాంతో సింగ్ బంతిని కొట్టడానికి క్రీజులో నుంచి బయటకు వచ్చాడు.

కానీ బంతి దాని దిశను మార్చి అతని వెనుక ఉన్న వికెట్స్‌కు తగిలింది.అంతే కన్ను మూసి తెరిచేలోగా సింగ్( Singh ) ఔట్ అయ్యాడు!

ఇది చాలా వేగంగా జరిగింది బ్యాటర్ ఏమైందో హౌ టు ఎలా అయిందో కూడా ఫిగరౌట్ చేయలేకపోయాడు.ఇంటర్నెట్ యూజర్లు ఈ ఔట్ చాలా ఫన్నీగా జరిగిందని జోకులు కూడా వేశారు.ఎక్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో దీని షేర్ చేయగా దీనిని బెస్ట్ బాల్ ఎవర్ అని సరదాగా కొంతమంది అభివర్ణించారు.

బంతి “కువైట్ నుంచి ఒమన్”కి వెళ్లిందని మరొక యూజర్ జోక్ పేల్చాడు.ఈ వీడియోను మీరూ చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube