భారతదేశంలో అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. చిన్న వయసులోనే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ఔత్సాహికులకు ఐకాన్‌గా మారిన కొందరు దిగ్గజ మహిళా ఐఏఎస్ అధికారులు ఉన్నారు.దేశానికి గర్వకారణమైన అటువంటి మహిళా ఐఎఎస్ అధికారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్ 22 సంవత్సరాల వయస్సులో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ చేశారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2000లో ఆమెకు ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ వచ్చింది.ఆమె ఐఏఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నారు.స్మితా సబర్వాల్‌ను “ది పీపుల్స్ ఆఫీసర్” అని పిలుస్తారు.
స్వాతి మీనా

స్వాతి మీనా రాజస్థాన్‌లో పుట్టి పెరిగారు.ఆమె తన చదువును అజ్మీర్‌లో పూర్తి చేశారు.ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ 2000 బ్యాచ్‌కి చెందినవారు.ఆల్ ఇండియా 260 ర్యాంకు పొందారు.ఆమె తండ్రి ఆమెను ఐఏఎస్ ఆఫీసర్‌గా చూడాలని కలలుగన్నారు.అతని ప్రోత్సాహంతో స్వాతి మీనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
సిమి కిరణ్

సిమి కిరణ్ ఒడిశాలోని బాలాసోర్ నగరానికి చెందినవారు.ఆమె 22 సంవత్సరాల వయస్సులో సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ 2019లో విజయం సాధించి, 31 ర్యాంకు పొందారు.సిమి కిరణ్ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఒడిశాలోని మొదటి అతి పిన్న వయస్కురాలైన మహిళా అధికారిగా ఘనత సాధించారు.
అనన్య సింగ్

అనన్య సింగ్ యూపీఎస్సీ సీఎస్ఈ 2019లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అది కూడా 22 సంవత్సరాల చిన్న వయస్సులోనే సాధించారు.ఆమె పాఠశాల దశ నుంచే ప్రతిభావంతురాలైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.ఆమె హైస్కూల్ పరీక్షలో 96% మార్కులు సాధించారు.స్కూల్ నుంచి కాలేజీ వరకు తన బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు.