టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి రీ ఎంట్రీ తో అడుగు పెట్టగా ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ప్రియమణి మంచి సక్సెస్ లను అందుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.కెరీర్ మొదట్లో తెలుగమ్మాయిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాను రాను గ్లామర్ ను పరిచయం చేసింది.
కొన్ని సినిమాలలో కూడా గ్లామర్ లుక్ తో బాగా ఆకట్టుకుంది.తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి మొత్తానికి మళ్లీ అడుగు పెట్టింది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మంచి ఫాలోయింగ్ అందుకుంది ప్రియమణి.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో జడ్జిగా చేస్తూ బాగా దగ్గరయ్యింది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్ గా మారింది.లేటు వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ లా కనిపిస్తుంది ఈ బ్యూటీ.
ఇక ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో నటించగా మంచి సక్సెస్ అందుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ సారీ లో అభిమానులను ఫిదా చేసింది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి.తన ఫోటోలతో బాగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా గ్లామర్ లుక్ లతో కూడా ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉంటే తాజాగా ప్రియమణి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.అందులో పింక్ రోజ్ సారీలో బాగా అందంగా కనిపించింది.అంతేకాకుండా ఈ చీరపై తన పేరు ప్రియా అని డిజైన్ చేయబడి ఉంది.
ఇక ఈ చీరను మెహెక్ శెట్టి డిజైన్ చేయగా ఇందులో ఎంతో అందంగా కనిపిస్తూ కన్నార్పకుండా చేస్తుంది ప్రియమణి.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.
దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వంలో నటించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటించింది.
ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.