మాజీ ఎమ్మెల్యే టిడిపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మహిళా సీఎం అంటూ వైరల్ కామెంట్ చేశారు.ఇటీవల ఏపీ సీఎం జగన్ ఏపీకి త్వరలో ఓ మహిళా ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడారు ఇంతకీ ఎవరు ఆ మహిళ అంటూ ప్రశ్నించారు.
తాడేపల్లి లో ఉన్న మహిళ సీఎం కాబోతున్నారా లేకపోతే హైదరాబాదులో ఉంటున్న వారు సీఎం అవుతున్నారా .? అంటూ ప్రశ్నించారు.ఇదే క్రమంలో ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ పై కూడా విమర్శలు చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న సాధన దీక్ష పై ప్రజల ఫోకస్ పడకుండా.ప్రజల ఫోకస్ మార్చడానికి దిశ యాప్ పేరుతో జగన్ సరికొత్త నాటకం చేశారని ఆర్భాటాలు ఆడారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచారాలు ఎక్కువగా జగన్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు చేసినవేనని సంచలన ఆరోపణలు చేశారు.
అదే రీతిలో మహిళల కోసం తీసుకొచ్చిన ఈ దిశ యాప్ లో మహిళా హోం మంత్రి ఫోటో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు లేకపోవడం దారుణమని విమర్శల వర్షం కురిపించారు.ఆల్రెడీ మహిళా పోలీసులు హోంగార్డులు ఉండగా మళ్ళీ మహిళా మిత్రులకు పోలీసు డ్రెస్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అని కూడా ప్రశ్నించారు.