సామాన్యులకు పెళ్లి విషయంలో ఎన్నో పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయి.కానీ మన సెలబ్రెటీలకు మాత్రం అలాంటివేవీ ఉండవండోయ్.
ఎందుకంటే తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటార నచ్చకుంటే వదిలేసి మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటుంటారు.ఇదంతా సెలబ్రెటీలకు కామన్ అనే చెప్పవచ్చు.
ఇక కొందరు సెలబ్రెటీలు వయసులో తమ కంటే పెద్దవారైన హీరోయిన్ లను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ లో ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా ఇలా చాలా మంది హీరోయిన్స్ తమకంటే చిన్న వాళ్లను పెళ్లి చేసుకున్నారు.
కానీ సంతోషంగానే ఉన్నారు.
ఇక ఈ మధ్య టాలీవుడ్ లో మంచి క్రేజీ లవ్ కపుల్ గా కనిపిస్తున్న
జంట విగ్నేష్, నయనతార
ఈ జంట పెళ్లికి ముందే సహజీవనం చేస్తున్నారు.ఈ విషయాన్ని నేరుగా వాళ్ల నోటి నుండే చాలాసార్లు విన్నాం.పైగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను, వాళ్లు గడిపిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసుకుంటారు.నిజానికి నయనతార తో దిగిన ఫోటోలను విగ్నేష్ మాత్రమే పంచుకుంటాడు కానీ నయన మాత్రం ఎక్కువగా పంచుకోదు.
ఇక ఉన్నట్టుండి ఈమధ్య తను కూడా విగ్నేష్ తో దిగిన ఫోటోలను షేర్ చేయడం మొదలు పెట్టింది.

ఇదంతా ఇలా ఉంటే నయనతార విగ్నేష్ కంటే వయసులో పెద్దదన్న సంగతి ఈ జంట అభిమానులకు మాత్రమే తెలుసు.ఓ ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు విగ్నేష్ ఈ విషయాన్ని బయట పెట్టాడు.ఇక వీరి మధ్య వయసు పది నెలలు తేడా అని బయటపడింది.
విగ్నేష్ కంటే నయనతార 10 నెలలు పెద్దది.కొన్ని కొన్ని సార్లు వీరు కలిసి దిగిన ఫోటోలను గమనించినట్లయితే తమ వయసులో గ్యాప్ కనిపించినట్లు తెలుస్తుంది.
అయితేనేం ఈ జంట చూడటానికి చాలా ముచ్చటగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే విగ్నేష్ డైరెక్టర్ అన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇక తన దర్శకత్వంలో నయనతో ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇక ఇటీవలే ఈ జంట తమ పెళ్లి గురించి ప్రకటించగా తమ పెళ్ళికి ఇంకా సమయం ఉందని అభిమానులకు నిరాశ కలిగించారు.