జబర్దస్త్ లో సీనియర్ కామెడీ స్టార్ ఎదిగిన రాకెట్ రాఘవ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో ఏళ్ల నుండి జబర్దస్త్ లో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మొదట్లో టీవీలలో కొన్ని షోలలో చేస్తూ జబర్దస్త్ కి పరిచయమయ్యాడు.ఇక్కడే సెటిల్ అయిన రాకెట్ రాఘవ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఆయన జీవితంలో చెప్పుకోలేని తప్పు చేశానంటూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకెట్ రాఘవ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.
తనకు ఇండస్ట్రీలో కన్నీటి గాధలు తక్కువేనని తెలిపాడు.తనకు పరిస్థితులను చూసి భయపడడం తప్ప బాధపడిన సందర్భాలు తక్కువేనట.
ఎవరితోనైనా తను వర్క్ చేస్తే తనను బాగా ఇష్టపడేవారట.ఇక ఆయన మొదట్లో టీచర్ ట్రైనింగ్ చేశాడట.
ఇక తన తండ్రి ఏదైనా ప్రైవేట్ స్కూల్ లో చేరమని సలహాలు ఇచ్చేవారట.కానీ యాక్టర్ గా మారానని తెలిపాడు.
తను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో సీరియల్ నటుడు శ్రీ రామ్ రూమ్ లో ఉంటూ తన సహాయంతో బాగా ఉండేవాడినని తెలిపాడు.

ఇక తను షూటింగ్ కు భోజనం కోసం మాత్రమే వెళ్ళేవాడట.ఇక ఆ తర్వాత జెమినీ టీవీలో అప్పటికే శ్రీనివాస్ రెడ్డి యాంకరింగ్ చేస్తున్న సమయంలో తనకు కూడా అవకాశం రావడంతో వెళ్లి యాంకరింగ్ చేశాడట.ఇక అప్పటికి శ్రీనివాస్ రెడ్డి ఇడియట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడని తెలిపాడు.
ఇక అలా ఆ ప్రోగ్రాంలో ఒక ఏడాది పాటు చేయగా కొత్త వాళ్లు వచ్చేయడంతో తనను తీసేస్తారని అనుకునేవాడట.ఇక శ్రీనివాస్ రెడ్డి తనకు జీవితం గురించి విలువైన సలహాలు ఇచ్చేవాడని తెలిపాడు.

ఇక నవ్వుల సవాల్ అనే ప్రోగ్రాం లో శ్రీనివాస్ రెడ్డి యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రోగ్రాం డైరెక్టర్ తనకు ఇదివరకే పరిచయం ఉండటంతో తనను ప్రోగ్రాం చేస్తావా అని అడిగాడట.ఇక కెరీర్ లో పైకి ఎదగాలనే తాపత్రయంతో ఓకే అని ఆ ప్రోగ్రాంను చేశాడట.అదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి సెట్ లోకి వచ్చి వెంటనే వెళ్లిపోయాడని తెలిపాడు రాఘవ.ఇక ఒకరోజు ప్రోగ్రామ్ ఎవరిచ్చారని శ్రీనివాస్ రెడ్డి అడగడంతో డైరెక్టర్ ఇచ్చాడని తెలిపాడట.
ఇక శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రోగ్రాం నేను చేస్తున్నాను కదా.కనీసం వాళ్లు కూడా ఇన్ఫామ్ చేయలేదని.సడన్ గా నువ్వు ఎలా చేస్తావ్, కనీసం నువ్వైనా చెప్పాలి కదా అని ఫీల్ అయ్యాడట.కానీ అది తనకు తెలియకుండానే మిస్టేక్ జరిగిందని తెలిపాడు రాఘవ.
ఇక అప్పటి నుంచి తను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యేవాడినని తెలిపాడు.శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు కనిపించినా ఆ విషయం గుర్తు వస్తుందని కానీ ఇప్పటికీ ఆ విషయాన్ని తన మనసులో పెట్టుకోకుండా కనిపించినప్పుడల్లా పలకరిస్తాడని.
తనని ఇంటికి రమ్మని కోరుతాడని తెలిపాడు రాఘవ.