మాస్ మహరాజ్ రవితేజ తన నెక్స్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు( Tiger Nageswar Rao ) సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
దసరా బరిలో ఆల్రెడీ బాలకృష్ణ ఖర్చీఫ్ వేశాడు.అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న భగవంత్ కేసరి సినిమా దసరాకి దుమ్ము దులిపేయాలని చూస్తుంది.
భగవంత్ కేసరి సినిమా టీజర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచేసింది.సినిమా తప్పనిసరిగా బాలకృష్ణకి మరో హిట్ ఇచ్చేలా ఉంది.
ఇక అలాంటిది బాలయ్య సినిమాకు టైగర్ నాగేశ్వర రావు పోటీకి వస్తున్నాడు.భగవంత్ కేసరి కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుండగా టైగర్ నాగేశ్వర రావు సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది.ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లో ఉన్నారు.స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కథతో ఈ సినిమా వస్తుంది. రవితేజ( Ravi Teja ) కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా వస్తుంది.మరి బాలయ్యకు పోటీగా దిగుతున్న టైగర్ ఏం చేస్తాడో చూడాలి.