వారు న్యూడిస్ట్‌లు కాదట.. జస్ట్ నేచురలిస్ట్‌లట..!

ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వస్త్రధారణ అనేది ఉంటుంది.ఏ దేశం అయిన, ఏ ప్రాంతం అయిన ఆడ, మగ ఒంటి మీద బట్టలు వేసుకోవడం మనం చూసే ఉంటాము.

 They Are Nudists Just Naturalists, Nudists, Marriage, Water, Nature, Electricity-TeluguStop.com

ప్రాంతాన్ని బట్టి కల్చర్ అనేది మారుతుంది.కొంతమంది ఆడవాళ్లు చీర కడితే మరికొందరు ఆడవాళ్లు జీన్స్, టీ షర్ట్స్ ధరిస్తారు.

మగవారు అయితే షర్ట్, ప్యాంటు, లుంగీ వంటివి ధరిస్తారు.అసలు బట్టలు అయితే వేసుకోకుండా మాత్రం ఉండరు.

ఇప్పుడు ఈ బట్టల గోల ఏంటి అనుకుంటున్నారా.?! అసలు మేటర్ లోకి వెళితే.మీరు చీర కట్టిన ఆడవాళ్ళని, లుంగీ కట్టిన మగవాళ్ళని చూసివుంటారు.కానీ., అసలు బట్టలే వేసుకొని ఇద్దరు దంపతులను ఎప్పుడన్నా చూసారా.ఒకవేళ చూడాలంటే మీరు ఇంగ్లాడ్ లోని అటవీ ప్రాంతానికి వెల్లవలిసిందే.

ఇంగ్లాండ్​ లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన జాన్, హెలెన్ అనే దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా సిటీకి దూరంగా ఒక అడవి ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నారు.మనలాగా వాళ్ళు కరెంటును ఉపయోగించరు.

అలాగే పైప్‌ లు, కుళాయిల ద్వారా వచ్చే నీటిని తాగరు.ఇంకో విచిత్రం ఏంటంటే.

అసలు ఈ జంట బట్టలే వేసుకోరు అంటే నమ్మండి. ఆ అటవీ ప్రాంతంలో ఒక పాత బస్సులో జీవనం గడుపుతున్నారు.

చీకటిలో ఉంటూ, నదులు, సరసులలో నీళ్లు తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవనం సాగిస్తున్నారు.ఒకవేళ వీరికి ఏదన్నా అవసరం వచ్చి నగరంలోకి వెళ్లవలిసి వచ్చినా కూడా బట్టలు వేసుకోకుండా అలా నగ్నంగానే వెళ్లి కావలసినవి తీసుకుని వస్తారట.

2006 నుంచి హెలెన్‌ ఇలా ప్రకృతి జీవనం కోనసాగిస్తున్నాడు.ఇలా ఆతన్ని ఇష్టపడి జాన్ 2011 లో హెలెన్ పెళ్లి చేసుకుంది.

ఇలా వీరిద్దరూ అప్పటినుంచి ప్రకృతి ప్రేమికులుగా మారిపోయి జీవనం సాగిస్తున్నారు.వీళ్ళని చూడటానికి అప్పుడప్పుడు పలువురు టూరిస్టులు కూడా వస్తారట.

ఇప్పుడు వీళ్ళ గురించి ప్రపంచం మొత్తం చర్చ మొదలైంది.ఈ క్రమంలో హెలెన్​ మాట్లాడుతూ.

`మాది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.ఇలాగే అందరు గడపాలని మేము అనుకోవడం లేదు.

అలా అని ఇలానే జీవనం కొనసాగించాలని మేం ఎవరినీ కూడా బలవంతం పెట్టడంలేదు.మాకు ఇలా జీవించడం నచ్చింది అని మమ్మల్ని చూసి మీరు న్యూడిస్ట్‌లం అని అనుకోకండి.

మేము ప్రకృతిని ఆస్వాదించే నేచురలిస్ట్‌లం అని తెలిపాడు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.

వారి దగ్గర రెండు టవల్స్​ తప్ప వేరే దుస్తులూ ఉండవు అని హెలెన్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube