ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థాయి క్రీడా వేదిక.ఒలింపిక్స్ లో స్థానం సంపాదించడానికి క్రీడాకారులు పోటీ పడుతుంటారు.
ఎంతో శ్రమించి కష్టపడి ఒలింపిక్స్ పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.ఇందులో గెలిచి దేశానికి వెళితే వారికి ఇక వరాలు జల్లు కురుస్తుందంతే.
కొన్ని రోజులకు ముందు టోక్యోలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి.అందులో భారత పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాన్ని సాధించింది.
ఒలింపిక్స్ ప్రారంభంలో చూస్తే భారత్ ను హాకీలో ఢీకొట్టాలంటే ప్రపంచ దేశాలు భయపడేవి.హాకీ అంటే భారత్ అంటూ కితాబునిచ్చేవి.అయితే రానురాను భారత్ హాకీలో అద్భుత ప్రదర్శనను కొనసాగించలేకపోయింది.41 సం.తర్వాత భారత హాకీ పురుషుల టీమ్ మునుపటి ఉత్సాహాన్ని తెచ్చింది.జర్మనీ హాకీ జట్టును ఓడించి భారత పురుషుల జట్టు విజయం సాధించింది.
దీంతో భారత్ ఖాతాలో కాంస్య పతకం వచ్చి చేరింది.
భారత హాకీ పురుషుల జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
వారికి పంజాబ్ సర్కార్ ఘనంగా సత్కరించింది.తాజాగా పంజాబ్ సర్కార్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
భారత హాకీ జట్టు క్రీడాకారుల పేర్లను పంజాబ్ లోని 10 ప్రభుత్వ స్కూళ్లకు పెట్టాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేసి పాఠశాలకు క్రీడాకారుల పేర్లను పెట్టడానికి అంగీకరించారు.

దీనిని పంజాబ్ విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా వెల్లడించారు.మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ కు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును పెట్టారు.అమృత్‌సర్ లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పేరు పెట్టినట్లు తెలిపారు.ఇకపోతే మిగిలిన క్రీడాకారుల పేర్లను కూడా ప్రభుత్వ పాఠశాలలకు పెట్టారు.
ఇలా పెట్టడం వల్ల క్రీడాకారులకు అరుదైన గౌరవం దక్కిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.