తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి రావడం తెలిసిందే.119 స్థానాలకు 64 స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన గాని గత రెండు ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది.మూడోసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ నేతలు పెద్దపీట వేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) అంటూ భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది.దీంతో ఇప్పుడు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ఈ ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారు.? వీటికి దరఖాస్తు చేసుకోవటం ఎలా? విధి విధానాల గురించి ప్రజలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఈ గ్యారెంటీల పథకాల దరఖాస్తుకు సంబంధించి ఫారం విడుదల చేయడం జరిగింది.
అయితే ఈ దరఖాస్తుకు ఫారం( Application Form ) ప్రకారం సిద్ధంగా ఉంచుకోవలసిన వివరాలు.దరఖాస్తుదారు ఫోటో, ఆధార్ కార్డు (జత చేయాలి), రేషన్ కార్డు (జత చేయాలి), ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ ఏజెన్సీ పేరు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, సర్వే సంఖ్య, విస్తీర్ణం, వ్యవసాయ కూలీ అయితే జాబు కార్డు నెంబర్, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ నెంబర్ కలిగి ఉండాలి.