సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా కొంత స్టార్ డం సొంతం చేసుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత రాజకీయాలలోకి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది.ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలో రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రులుగా కూడా బాధ్యతలు తీసుకున్నటువంటి మరికొందరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత కొందరు సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి పెద్ద ఎత్తున అవమానాలను ఎదుర్కోవడమే కాకుండా పెద్దగా సక్సెస్ కూడా కాలేదు మరి రాజకీయాలలోకి వచ్చి అవమానాలను ఎదుర్కొన్నటువంటి ఎవరు అనే విషయానికి వస్తే…
చిరంజీవి:
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి( Chiranjeevi ) ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈయన 2008వ సంవత్సరంలో తన నటనకు గుడ్ బై చెబుతూ సీనియర్ ఎన్టీఆర్ ను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాలలోకి వచ్చారు రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన ప్రజారాజ్యం పార్టీని( Prajarajyam Party ) స్థాపించారు.2009లో జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసే 18 సీట్లు గెలుపొందిన తర్వాత ఈయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంచిగా కొనసాగారు.ప్రస్తుతం ఈయన సినిమాలకు మాత్రమే పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

విజయశాంతి:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయశాంతి(Vijaya Shanthi) ఇండస్ట్రీకి దూరమైన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు గతంలో బిజెపి పార్టీకి పనిచేశారు అనంతరం ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే రాజకీయాలలో విజయశాంతి అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు.

జగ్గయ్య:
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా గుర్తింపు పొందినటువంటి జగ్గయ్య(Jaggayya ) 1976వ సంవత్సరంలో ఒంగోలు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.అయితే భారతదేశంలో మొదటిసారి ఒక సినీ నటుడు చట్టసభలలోకి వెళ్లిన నటుడిగా ఈయన గుర్తింపు పొందారు.అయితే కొంతకాలం తర్వాత ఈయన కూడా రాజకీయాలకు దూరమయ్యారు.

పవన్ కళ్యాణ్:
చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2014 సంవత్సరంలో జనసేన పార్టీని( Janasena ) స్థాపించారు.అయితే ఈయన 2014 సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశారు అయితే 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు ఇప్పుడు కూడా టిడిపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు అయితే ఈయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా గెలవకపోవడం విశేషం.

కమల్ హాసన్:
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమల్ హాసన్ (Kamal Haasan) కూడా పార్టీ పెట్టారు.అయితే గత ఎన్నికలలో ఈయన పోటీ చేసిన పెద్దగా ఆశించిన స్థాయిలో గెలవలేకపోయారు.కమల్ హాసన్ కూడా రాజకీయాలలోకి వచ్చి కాస్త అవమానాలు పడ్డారు.ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగినటువంటి జయలలిత, ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి నటులు దృష్టిలో గుర్తింపు సంపాదించుకొని సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు.
వీరిని చూసి మరి కొందరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కాలేక అవమానాలు పడ్డారని చెప్పాలి.