మల్బరీ సాగుకు నీటి వసతులను బట్టి పంపిక రకాలను ఎంచుకోవాలి.మేలురకం పంపికలను ఎంచుకొని, నూతన వ్యవసాయ పద్ధతులను క్రమంగా పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.నీతి వసతి లేని భూములలో మేలు రకం పంపికలు ఏమిటో చూద్దాం.“అనంత పంపిక” అనేది చాకి మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనుకూలంగా ఉండి, దాదాపుగా 25 టన్నుల దిగుబడి పొందవచ్చు.దక్షిణాది రాష్ట్రాలలోని పర్ర నేలలలో “పస్ పంపిక” చాలా అనుకూలంగా ఉండి, ఎకరాకు దాదాపుగా 6.5 టన్నులు దిగుబడి పొందవచ్చు.
ఆర్.సి 1 పంపిక
: నీటి వసతి కాస్త అటు ఇటు అయినా తట్టుకుంటుంది.ఇంకా ఎరువులను తగిన మోతాదులో వేయకపోయినా పర్వాలేదు.ఎకరానికి దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.
ఆర్.సి 2 పంపిక
: సాధారణ నీటి వసతి చాలా తక్కువగా ఉన్న తట్టుకుని ఎకరాకు దాదాపుగా ఎనిమిది టన్నుల దిగుబడి పొందవచ్చు.
నీటి వసతి సమృద్ధిగా ఉన్న ప్రాంతాలలో అనువైన రకాలు ఏంటో చూద్దాం .” వి 1″ పంపిక తో ఎకరాకు దాదాపుగా 30 టన్నుల దిగుబడి పొందవచ్చు.” పస్ 30″ చాకీ పెంపకానికి అనుకూలంగా ఉంటూ, ఎకరాకు దాదాపుగా 15 టన్నుల దిగుబడి పొందవచ్చు.” ఆర్.పస్.పస్” తో ఎకరానికి 18 టన్నుల దిగుబడి పొందవచ్చు.భూమి సారవంతం కోల్పోకుండా ఉండాలంటే ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువులు, చాకీ తోటలలో అయితే 16 టన్నుల ఎరువులు అందించాలి.ఇక తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు అందించాలి.
ముఖ్యంగా రసాయనిగా ఎరువులు వేసేటప్పుడు నేలలో తేమ ఉండాలి.
పోషక ద్రావణం ను మల్బరీ ఆకులపై పిచికారి చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది.ఈ పోషక ద్రావణం పంటకు ఒకసారి మాత్రమే పిచికారి చేయాలి.ఎక్కువగా జీవన ఎరువుల వాడకం, వర్మి కంపోస్ట్ ఎరువులను వినియోగించి, రసాయన ఎరువుల వాడకం 30% పైగా తగ్గించినట్లయితే నాణ్యత గల దిగుబడులు అధిక మోతాదులో పొందవచ్చు.