ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో మనీశ్ సిసోడియాను హాజరుపరచనున్నారు అధికారులు.
కాగా ఈరోజుతో సిసోడియా సీబీఐ కస్టడీ ముగుస్తున్న విషయం తెలిసిందే.
మధ్యాహ్నం సిసోడియాను సీబీఐ కోర్టు ఎదుట హాజరు పరచనుంది సీబీఐ.
ఇప్పటికే మద్యం కుంభకోణంపై సిసోడియాకు సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
అయితే కేసు పురోగతిని సీబీఐ కోర్టుకు వివరించనున్న సీబీఐ… సిసోడియా కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం ఉంది.