ప్రస్తుత సమాజంలో కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక రంగంలో కూడా కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉన్నారు.ఇప్పటికీ చాలామంది ఈ కాస్టింగ్ ఎదుర్కొంటూనే ఉన్నారు.
అయితే ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు వారు ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్న విషయం తెలిసిందే.
తమపై జరిగిప లైంగిక దాడుల గురించి నటీనటులు నోరు విప్పుతున్నారు.అయితే మహిళలపైనే కాదు పురుషులపై కూడా లైంగిక వేధింపులు జరిగినట్లు పలువురు ఆరోపించారు.

ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన పురుషులు వారిపై లైంగిక దాడులు జరిగినట్టు తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా మరో బాలీవుడ్ నటుడు తాను లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నట్లు తెలిపాడు.ఆ నటుడు ఎవరు? ఏం జరిగింది అన్న వివరాల విషయానికి వస్తే.బాలీవుడ్ సినీ రచయిత, నటుడు,నేపథ్య గాయకుడు అయిన పియూశ్ మిశ్రా సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు.
బాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన పియూష్ ఆ మద్య అక్కినేని నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో విలన్ గా నటించాడు.

అయితే తాను ఏడవ తరగతి చదివే రోజుల్లో ఒక బంధువు తనను లైంగికంగా వేదించిందని పేర్కొన్నాడు.ఈ విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ పుస్తకంలో పొందుపరిచాడు పియూష్.శృంగారం అనేది ఒక ఆరోగ్యకరమైన అంశం.
మొదటిసారి అనుభవం ఎంతో అద్బుతంగా ఉండాలి.లేదంటే అది మీ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.
నా జీవితంలో అలాంటి లైంగిక వేధింపు ఎంతో కష్టం అనిపించింది.దాని నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది.
నాపై లైంగిక వేదింపులు చేసిన వారి గురించి నేను ఇప్పుడు ప్రస్తావించలేను.ఎందుకంటే వారు సినీ పరిశ్రమలో బాగా స్థిరపడ్డారు.
నేను ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదు’ అని పియూశ్ మిశ్రా తెలిపారు.







