జీ-మెయిల్ లో ఈ షార్ట్ కట్స్ తెలిస్తే.. ఆర్గనైజ్ చేయడం చాలా సులభం..!

ప్రస్తుత కాలంలో చాలామంది యువతకు జీ-మెయిల్( Gmail ) అకౌంట్ కచ్చితంగా ఉండే ఉంటుంది.అయితే ఒకేసారి భారీ సంఖ్యలో వచ్చే మెయిల్స్ కు( Mails ) రిప్లై ఇవ్వడం కాస్త కష్టమే.

 These Are The Best Gmail Shortcuts For Daily Use Details, Gmail, Gmail Shortcuts-TeluguStop.com

అన్ని మెయిల్స్ కు రిప్లై ఇవ్వాలంటే సమయం కూడా చాలా వృధా అవుతుంది.అయితే జీ-మెయిల్ కు సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ తెలుసుకుంటే ఇక జీ-మెయిల్ లో మీరు ఎక్స్ పర్ట్ అయినట్టే.

చాలా సులభంగా జీ-మెయిల్ ను ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

జీ-మెయిల్ ను ఆర్గనైజ్ సులభతరం చేసే సింపుల్ షార్ట్ కట్స్ ఏమిటో తెలుసుకుందాం.

జీ-మెయిల్ అకౌంట్ కు( Gmail Account ) లాగిన్ అయిన తర్వాత అందులో కనిపించే గేర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్( Settings ) ఓపెన్ అవుతుంది.ఆ సెట్టింగ్స్ లో కీ బోర్డు( Key Board ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఈ కీబోర్డ్ ఆప్షన్ ను ఆన్ చేసి, సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి.ఇక జీ-మెయిల్ లో షార్ట్ కట్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం.కీ బోర్డు లో ఉండే C అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.ఈమెయిల్ కంపోజ్ అవుతుంది.

కొత్త ఈమెయిల్ విండో ఓపెన్ అవుతుంది.

Telugu Gmail Shortcuts, Gmail, Mails, Organize Gmail, Shortcuts-Latest News - Te

కీబోర్డులో ఉండే A అక్షరాన్ని ప్రెస్ చేస్తే.అన్నీ ఈ-మెయిల్స్ కు ఒకేసారి రిప్లై ఇవ్వవచ్చు.కీబోర్డులో R అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.

మీరు చివరిసారిగా పంపించిన ఈ-మెయిల్ కు మరల రిప్లై ఈమెయిల్ వెళుతుంది.కీ బోర్డులో E అక్షరాన్ని ప్రెస్ చేస్తే.

సెలెక్ట్ చేసుకున్న ఈ-మెయిల్ ఇన్ బాక్స్ నుండి డిలీట్( Delete ) అవుతుంది.కీబోర్డులో F అక్షరాన్ని ప్రెస్ చేసి.

మీరు తెరచి ఉంచి, సెలెక్ట్ చేసిన ఈ-మెయిల్ ఇతరులకు ఫార్వర్డ్ చేయబడుతుంది.

Telugu Gmail Shortcuts, Gmail, Mails, Organize Gmail, Shortcuts-Latest News - Te

కీ బోర్డులో L అనే అక్షరాన్ని ప్రెస్ చేస్తే.ఈ-మెయిల్ ను ఆర్గనైజ్ లేదా కేటగిరైజ్ చేసుకోవచ్చు.కీ బోర్డు లో S అనే అక్షరాన్ని ప్రెస్ చేసి.

ఏదైనా ఈ మెయిల్ ను ఓపెన్ చేసి దానికి స్టార్ గుర్తు ఇవ్వవచ్చు.జీ-మెయిల్ లో అన్ని షార్ట్ కట్స్ లిస్ట్ తెలుసుకోవాలంటే.shift+ ? ప్రెస్ చేస్తే సరిపోతుంది.షార్ట్ కట్స్ తెలిస్తే క్షణాల్లో జీ-మెయిల్ రిప్లై ఇవ్వడం, ఫార్వర్డ్ చేయడం, కొత్త మెయిల్స్ పంపించడం చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube