స్టార్ హీరో బాలకృష్ణ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నా ఒకప్పుడు ఎక్కువ సంఖ్యలో రీమేక్ సినిమాలలో నటించారు.ఒక భాషలో హిట్టైన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది.
రీమేక్ సినిమాలు ఎక్కువ సందర్భాల్లో సక్సెస్ సాధిస్తే కొన్నిసార్లు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి.బాలయ్య తండ్రి నటించిన నర్తనశాల రీమేక్ లో నటించారు.
అయితే సౌందర్య మరణం వల్ల ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది.
అప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ ను గతేడాది దసరా కానుకగా ఏటీటీలో రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
బాలయ్య హీరోగా నటించిన లయన్ సినిమా టోటల్ రీకాల్ అనే సినిమాకు ఇన్స్పిరేషన్ కావడం గమనార్హం.లయన్ సినిమా అఫీషియల్ రీమేక్ కాపోయినా ఫ్రీ మేక్ అని చెప్పవచ్చు.
బాలయ్య నటించిన ఒక్క మగాడు సినిమా కూడా భారతీయుడు సినిమాకు ఫ్రీమేక్ అని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన లక్ష్మీ నరసింహ మూవీ సామి సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే.

బాలకృష్ణ తండ్రి నటించిన పాండురంగ మహత్యం రీమేక్ పాండు రంగడు సినిమాలో నటించారు.బాలయ్య నటించిన విజయేంద్ర వర్మ సినిమా ది బౌర్నే ఐడెంటిటీ సినిమాకు ఫ్రీమేక్ కావడం గమనార్హం.కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాజ నరసింహ సినిమాకు రీమేక్ గా పలనాటి బ్రహ్మనాయుడు సినిమా తెరకెక్కింది.

హిందీలో గోవిందా హీరోగా నటించిన హీరో నంబర్ 1 కు రీమేక్ గా బాలయ్య నటించిన గొప్పింటి అల్లుడు తెరకెక్కింది.బాలయ్య నటించిన శ్రీ కృష్ణార్జున యుద్ధం శ్రీ కృష్ణ పాండవీయం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.తమిళంలో హిట్టైన తంగమన రాసా సినిమాకు రీమేక్ గా బాలయ్య ముద్దుల మేనల్లుడు తెరకెక్కింది.
బాలయ్య నటించిన ముద్దుల మావయ్య, అశోక చక్రవర్తి, రాముడు భీముడు, మువ్వగోపాలుడు, నిప్పులాంటి మనిషి, బాబాయ్ అబ్బాయ్, ఆత్మ బలం మరికొన్ని సినిమాలు రీమేక్ సినిమాలుగా ఉన్నాయి.