పాశ్యాత్య దేశాల్లో డేటింగ్ చేయడం అంటే పెద్ద నేరం ఏం కాదు.అక్కడ ఉన్న వారంతా తమకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్ చేస్తూ నచ్చితే పెళ్లి చేసుకుంటారు.
నచ్చక పోతే బ్రేక్ అప్ చెప్పేసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు.కానీ మన దేశంలో అలా కాదు.
పెళ్లి అంటేనే పవిత్రంగా భావిస్తాము. పెళ్ళికి ముందు అలా డేటింగ్ అంటూ తిరిగితే పెద్ద వారు చూస్తూ ఊరుకోరు.
అయితే ఇతడి గురించి వింటే ముందు మీరు షాక్ అవుతారు.ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుంటే మాత్రం అతడిని మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.ఇంతకీ అతడు ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారా.అతడు ఇప్పటికే 335 మందితో డేటింగ్ చేసాడు.
అతడి టార్గెట్ 365 అట.ఇంకా 30 మందితో డేటింగ్ చేయాలనీ ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఇతడు చేసేది అందరు అనుకున్న డేటింగ్ కాదు.
అతడు ఎందుకు చేస్తున్నాడో కారణం కూడా చెబుతున్నాడు.
అతడి దృష్టిలో డేటింగ్ అంటే రొమాంటిక్ రిలేషన్ షిప్ కాదట.అలా ఆ దృష్టితో అతడు ఆలోచించడం లేదు.
ఇతడు తమిళ నటుడు, డాన్సర్, ఫోటోగ్రాఫర్.ఇతడి పేరు సుందర్ రాము.
ఇతడు ఇప్పటి వరకు 335 మందితో డేటింగ్ చేసాడు.ఇంకా 30 అంన్డితో చేయాలనీ అంటున్నాడు.
ఇతడికి ఒక ముద్దు పేరు కూడా ఉంది.ఏంటంటే.
సీరియల్ డేటర్.

ఇతడు ఇప్పటి వరకు వయసుతో సంబంధం లేకుండా 335 మంది మహిళలతో డేటింగ్ కు వెళ్ళాడు.ఆ లిస్టులో ముసలవాళ్ళు కూడా ఉన్నారు.అయితే ఇతడు 2012 లో జరిగిన నిర్భయ ఘటన తెలిసాక.
అతడికి చాలా బాధ వేసిందట.కొన్ని రోజుల వరకు ఆ బాధలోనే గడిపాడని అతడు చెబుతున్నాడు.

మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదని.అందుకే నేను ఇలా డేటింగ్ పేరుతొ మహిళలను లంచ్ కానీ కాఫీకి కానీ తీసుకు వెళ్లి వాళ్లకు వాళ్ళ హక్కుల గురించి చెప్పి అవేర్నెస్ పెంచాలని ఇలా చేస్తున్నాని అతడు చెబుతున్నాడు.నేను మహిళలతో సంభందాలు పెట్టుకోవడమా కోసం డేటింగ్ చేయడం లేదని దాని వెనుక మంచి ఉద్దేశంతోనేఇలా చేస్తున్నానని అతడు చెబుతున్నాడు.