అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న IPL 2023 షెడ్యూల్ వచ్చేసింది.ప్రపంచ క్రికెట్లో ఎన్ని లీగులు వున్నాసరే అవన్నీ IPL ముందు దిగదుడుపే.
అందుకే IPLని బాప్ ఆఫ్ ఆల్ క్రికెట్ లీగ్స్ అని చెప్తారు.వేర్వేరు దేశాల క్రికెటర్లు అందరూ ఒక్కతాటిపై నడిచి క్రికెట్ ప్రేమికులకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తారు.
అందుకే దానికి అంత డిమాండ్.అయితే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ IPL కోసం మీరు మరెన్నో రోజులు వెయిట్ చేయనక్కర్లేదు.
లీగ్ ఆరంభంపై ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ BCCI తాజా అప్డేట్ ఇచ్చింది.
అవును, మార్చి 31 నుంచి IPL 2023 ప్రారంభం కానుంది.BCCI తెలిపిన వివరాలు ప్రకారం లీగ్ దశలో చివరి మ్యాచ్ మే 21న జరగనుంది.అలాగే ఫైనల్ మ్యాచ్ మే 28న నిర్వహిస్తారు.
లీగ్ దశలో మొత్తం 70 మ్యాచులు ఉండగా అందులో 18 డబుల్ హెడర్స్ ఉంటాయి.ఇక టోర్నీలో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
దీనికి గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక కానుంది.గత సీజన్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఫేవరెట్ సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీలు గ్రౌండ్లో తలపడనున్నారు.
కాగా, ఐపీఎల్ 2023లో మొత్తం రెండు గ్రూపులు ఉండనున్నాయి.
గ్రూప్ – Aలో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.అలాగే గ్రూప్ – Bలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.గత IPLలో చతికల పడిన ఆటగాళ్లు ఈ ఐపీఎల్ 2023లో అయినా బాగా ఆడాలని కోరుకుందాం.
అలాగే గత IPLలో బాగా ఇరగదీసిన వారు ఇంకా బాగా ఆడాలని ఆశిద్దాము.ఇక మీరు కూడా ఈ సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా?
.