హెలికాప్టర్ గాల్లో ఉండగానే అద్భుతంగా ఇంధనం నింపారు.. వీడియో వైరల్..!

గాల్లో హెలికాప్టర్స్( Helicopters ) ఎగురుతున్నప్పుడు ఫ్యూయల్ అయిపోతే ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిలో కలిగే ఉంటుంది.ఫ్యూయల్ అయిపోతున్న సమయంలో హెలికాప్టర్ సడన్‌గా ఒకచోట ఆగే ఛాన్స్ కూడా ఉండదు.

 The Helicopter Was Miraculously Filled With Fuel While In The Air The Video Went-TeluguStop.com

ఇలాంటి సందర్భంలో మరి ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది, ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.

వీడియో ఓపెన్ చేస్తే మనకు ఆకాశంలో ఫ్యూయల్ రీఫిల్( Fuel refill ) చేస్తున్న అద్భుత దృశ్యం కనిపిస్తుంది.ఈ వీడియోలో ఎగిరే హెలికాప్టర్‌లో ఇంధనం ఎలా నింపబడిందో మీరు చూడవచ్చు.ముందుగా వెళుతున్న హెలికాప్టర్ నుంచి ఒక పైపు రాగా ఆ పైపులోకి పెట్రోల్ పంపు లాంటి ఒక గొట్టాన్ని దూర్చడం మీరు చూడవచ్చు.తర్వాత ఆ పంపు పైపు లోపల లాక్ అయిపోయింది.

అనంతరం ఫ్యూయల్ రీఫిల్ చేసినట్లు ఉన్నారు.కచ్చితంగా ఇలాంటి దృశ్యాన్ని మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు.

ఇది నిజంగా ఒక గ్రేట్ ఐడియా అని చెప్పవచ్చు.ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అటువంటి పరిస్థితిలో, ఇవన్నీ చూసిన తర్వాత, ప్రపంచం చాలా అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుందని ఒక వినియోగదారు రాశారు.ఈ వీడియో ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వ్యూస్ పొందింది.

ఈ వీడియో ‘@ScienceGuys_’ అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube