ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ వాస్తు శిల్పకళా గొప్పతనం తెలుసుకోవాలంటే రాజుల కాలంలో కట్టించిన దేవాలయాలు, గోపురాలు, కోటలు చూడాలని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నల్గొండ జిల్లా పానగల్లు లో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం( Sri Chaya Someswara Temple ) లో చరిత్రకా ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి.
ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కందూరి చోళ రాజులు తెల్లని రాయి తో నిర్మించారు.అలాగే గర్భ గుడిలోని శివలింగం మీద వెలుతురు ఉన్నంత సేపు స్తంభం నీడ పడుతుండడం ఈ దేవాలయం ప్రత్యేకత అని స్థానిక భక్తులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్తంభం నీడ ఎక్కడి నుంచి పడుతుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని భక్తులు ( Devotees )చెబుతున్నారు.
అలాగే సూర్యుని భార్య ఛాయాదేవి నీడ శివుని పై పడుతుందనేది కూడా మిస్టరీనే ఉంది అని పండితులు చెబుతున్నారు.అలాగే సూర్యుని భార్య ఛాయాదేవి నీడ శివుని పై పడుతున్నందున ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వరాలయం అని పేరు కూడా వచ్చింది.ఈ దేవాలయం ఆవరణలో సూర్యుడు, విష్ణువు ఉన్నారు.
అలాగే శివుడి దేవాలయాలు కూడా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే మూడు గర్భాలయాలు ఒకే చోట ఉన్నందున దీన్ని త్రి కుటాలయం అని కూడా అంటారు.
అయితే ఈ ఆలయం అవారణలో తూర్పున సూర్య దేవాలయం, పడమర దిక్కున శివాలయం, ఉత్తరాన విష్ణు దేవాలయం ఉంటుంది.ఇక్కడి శివలింగాన్ని జల లింగం అని అంటారు.
ఇక్కడి కోనేరులో సంవత్సరం అంతా నీళ్ళు ఉంటాయి.ఇంకా చెప్పాలంటే గద, శంఖు చక్రాలు చెక్కిన గోడలు, దేవనాగరి లిపిలో ఉన్న శాసనాన్ని చూడవచ్చు.పిల్లర్స్ మీద రామాయణ, మహాభారత ఉదాంతాల శిల్పాలు చెక్కారు.మహా శివరాత్రి( Maha Shivratri ) రోజున భక్తులు ఇక్కడికి ఎక్కువగా తరలివస్తారు.ఈ దేవాలయానికి ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.నల్గొండ జిల్లా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది.
శ్రీ ఛాయా సోమేశ్వరాలయం ( Sri Chaya Someswara Temple )హైదరాబాద్ నుంచి 104 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం ఆరు గంటల నుంచి 12:00 వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భగవంతుణ్ణి దర్శనం చేసుకునే వీలు ఉంటుంది.
DEVOTIONAL