దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ( Chintamaneni Prabhakar )నియోజకవర్గంలో “బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ” కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు.2019 ఎన్నికలలో ఓడిపోయిన చింతమనేని ఈసారి 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా నిత్యం శ్రమిస్తున్నారు.ఇదే సమయంలో చింతమనేని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి ( Telugu Desam Party )భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే శుక్రవారం.“బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ” కార్యక్రమం నిర్వహించారు.పెదపాడు మండలం ఏపూరులో మూడవ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.అభివృద్ధి అంటే కనీసం అవగాహన లేని జగన్( CM jagan ) లాంటి మోసగాడు ముఖ్య మంత్రి అవ్వడం వల్ల నేడు మన రాష్ట్రానికి రాజధాని, యువతకు భవిష్యత్తు లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు.చంద్రబాబు విజన్ తోనే రాష్ట్రానికి పునర్ వైభవం వస్తుందని అన్నారు.
చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర విభజన జరిగినా అనంతరం 2014 ఎన్నికలలో గెలిచారు.ఆ తర్వాత 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.
దీంతో ఇప్పుడు 2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.