తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లోకి వలసల పర్వం కొనసాగుతోంది.ఇందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఇవాళ హస్తం గూటికి చేరనున్నారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి( Anita Reddy ), వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy ), జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ( Mayor Mote Srilatha )కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ( Bontu Rammohan )మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.కాగా ఈ చేరికలన్నీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కొనసాగనుండగా.
ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు.