స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు.ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డేరా బాబా 2017లో అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు.
అప్పటి నుంచి జైలులోనే ఉన్న డేరా బాబా.గత ఐదేళ్లలో ఐదు సార్లు పెరోల్‌పై విడుదలై బయటికి వచ్చారు.
ప్రస్తుతం పెరోల్‌పై విడుదలయ్యారు.ఈ క్రమంలో తాజాగా డేరా బాబా దీపావళి వేడుకల సందర్భంగా తన మ్యూజిక్ వీడియోను విడుదల చేశాడు.
దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయితే పెరోల్‌పై విడుదలై దోషి ఈ తరహా హంగామా చేయవచ్చా? అనే విషయాన్ని పక్కన పెడితే.తన మ్యూజిక్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది.
కేవలం 24 గంటల్లో 42 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అలాగే జైలు నుంచి విడుదలైన ప్రతిసారి తన సత్సంగాలను ఆన్‌లైన్ రిలీజ్ చేస్తున్నారు.అలాగే ఈ సత్సంగాలకు పలువురు బీజేపీ నేతలు కూడా హాజరవుతున్నారని టాక్.
దీంతో బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.కాగా డేరా బాబా ‘Sadi Nit Diwali’ పేరుతో వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సాంగ్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పలు విమర్శలు చేశారు.బ్రిటన్, అమెరికా తరహాలోనే ఇండియాలో కూడా పెరోల్ రిజిస్ట్రేషన్‌ను కోడిఫైడ్ చేయాలని ట్విట్‌లో పోస్ట్ పెట్టారు.
పెరోల్ చట్టాన్ని మార్చాలని సమయం వచ్చిందన్నారు.
కాగా, గత ఐదేళ్లలో డేరా బాబా పెరోల్‌పై ఐదుసార్లు విడుదల అయ్యారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండు సార్లు జైలు నుంచి బయటికి వచ్చారు.జైలు నుంచి విడుదలైనప్పుడు డేరా బాబాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
అయితే ఈ సారి సుధీర్ఘ కాలం సెలవు దొరికింది.దీంతో డేరా బాబా సొంత మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు.
ఈ సాంగ్‌కు రచన, సంగీతం, దర్శకత్వం మొత్తం డేరా బాబానే బాధ్యతలు వహించారు.అయితే డేరా బాబా పెరోల్‌పై విడుదలైన ప్రతిసారి యూపీలోని బార్నవా ఆశ్రమంలోనే ఉంటున్నారు.
ఆన్‌లైన్‌లో సత్సంగాలు నిర్వహిస్తున్నారు.యూపీ, హర్యానాకు చెందిన బీజేపీ నేతలు ఈ సత్సంగానికి హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.